Libra Horoscope | తులా రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
తులా రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా తులా రాశి గురించి తెలుసుకుందాం.
Ugadi Panchangam | చిత్త - 3 , 4 పాదములు, స్వాతి - 1, 2, 3, 4 పాదములు, విశాఖ - 1,2,3 పాదములు
* ఆదాయం - 8
* వ్యయం - 8
* రాజ్యపూజ్యం - 7
* అవమానం - 1
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి 6వ స్థానమునందు సంచరించుట, శని 5వ స్థానము, వక్రియై 4వ స్థానమునందు సంచరించుట, రాహువు కళత్ర స్థానమగు 7వ స్థానమందు సంచరించుట, కేతువు 1వ స్థానమునందు సంచరించుటచేత తులా రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థము నుంచి శుభఫలితములు ఉన్నవి. తులా రాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగములో స్వల్ప ఒత్తిళ్లు, ధనలాభము, కుటుంబము సౌఖ్యము కలుగును. సప్తమ రాహువు ప్రభావముచేత మానసిక ఒత్తిడులు అధికముగా ఉండును.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో శని వక్రియై 4వ స్థానమునందు సంచరించుటచేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితములు ఉండును. బృహస్పతి 6వ స్థానములో సంచరించుట చేత శత్రు వృద్ధి, మీ మీద రాజకీయాలు జరుగుట, ఒత్తిళ్లకు గురి అగుట వంటివి జరుగును. 6వ స్థానమందు బృహస్పతి ప్రభావం చేత తులా రాశివారికి ఈ సంవత్సరం ఉద్యోగ, కుటుంబవిషయములు యందు జాగ్రత్తలు వహించవలెను. ఈ సంవత్సరం తులా రాశి వారికి ఉద్యోగ, వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు. కుటుంబమునందు స్వల్ప అనుకూల ఫలితములు కలుగును. తులారాశి వారికి అర్థాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యమునకు సంబంధించిన విషయమందు, ఒత్తిళ్లకు సంబంధించినటువంటి విషయములందు, లావాదేవీలకు సంబంధించిన విషయముల యందు జాగ్రత్త వహించవలెను.
తులా రాశివారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మధ్యస్థ ఫలితములు. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య అనుకూల ఫలితములు ఉన్నవి. ఈ సంవత్సరం ఆదాయంతో సమానమైనటువంటి ఖర్చు ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. స్త్రీలకు మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు అధికముగా ఉన్నవి. ఆరోగ్య విషయములమందు జాగ్రత్త వహించవలెను. వ్యాపారస్తులకు, రైతులు, సినీరంగం వారికి మధ్యస్థ ఫలితములు ఉన్నవి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. తులా రాశివారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, మంగళవారం విఘ్నేశ్వరుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ - ఈ మాసం అనుకూలంగా ఉన్నది. ధనలాభం, మిత్రలాభం, విందు భోజనములు కలుగును. సంతానం వలన లాభము కలుగును. చేసే ప్రతి పనియందు విజయము పొందుదురు. ధనలాభం ఉండును. అనుకున్న పనుల పూర్తి చేసేదరు.
మే - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సూచనలు, అకాల భోజనము, పాపకర్మలయందు ఆసక్తి పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు అభివృద్ధి. సంతానం కారణంగా సంతోషము. వృధా ప్రయాణములు. బంధుమిత్రులతో గొడవలు కలుగును.
జూన్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనవసరపు ఖర్చులు అధికము. ప్రయాణములు, శత్రువులతో గొడవలు, భయము, వస్త్ర, ధన, ధాన్య లాభములు కలుగును.
జూలై - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి. మిత్రుల సహాయంతో సమస్యలు తొలగిపోతాయి. ధనలాభము, అకారణంగా గొడవలు, అన్న వస్త్రాలకు ఇబ్బంది కలుగును.
ఆగస్టు - ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉన్నది. మీ కోరికలు నెరవేరతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ఉన్నతి, బంధువుల కారణముగా చికాకులు.
సెప్టెంబర్ - ఈ మాసం మీకు కలసి వచ్చును. కుటుంబ సౌఖ్యము, సంతానం కారణంగా సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి. అనారోగ్య సూచనలు మిత్రుల ద్వారా సహాయము అందును.
అక్టోబర్ - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనుకున్న పనులు జరగవు. కుటుంబము నందు చికాకులు, అకాల భోజనములు, మిత్రులతో విరోధము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు ప్రతికూలముగా ఉండును.
నవంబర్ - ఈ మాసం మీకు అంతా అనుకూలంగా లేదు. ప్రతి విషయమునందు ప్రతికూలత. కుటుంబమునకు దూరమగుట, విద్యా అధికారములందు జయము. అనవసరముగా ప్రయాణములు చేయుట వలన అలసట, బంధుమిత్రులతో గొడవలు జరుగును.
డిసెంబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నాయి. దూరప్రదేశమందు నివాసము, మంచివాళ్లతో పరిచయం, ఆరోగ్యము అనుకూలత. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు అనుకూలించవు.
జనవరి - ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. పుత్రులవలను సంతోషము. ఆరోగ్యం అనుకూలంగా ఉండును. అప్పుల వారి నుంచి ఒత్తిడి, అవమానములు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల యందు అభివృద్ధి ఉండును.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శారీరక సౌఖ్యము, అప్పుల వారి ఒత్తిడి, మిత్రలాభము, వినోదయాత్రలు చేస్తారు. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి.
మార్చి - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. సంతానముతో చికాకులు, గొడవలు ఏర్పడును. సంతానమునకు అనారోగ్యము, మానసిక ఆందోళన. ఆదరణ, గౌరవములు పెరుగును.
సంబంధిత కథనం