Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు శివారాధన చేస్తే.. ఆ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి
08 October 2022, 5:00 IST
- Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 8వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (8-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
మేష రాశి
మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయండి. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
వృషభ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
మిధున రాశి
ఈరోజు మీకు మధ్యస్తము నుంచి చెడు ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. వ్యాపారస్తులకు డబ్బుల విషయములో ఇబ్బందులు ఏర్పడతాయి. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణములలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగిపోతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్తే మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.
సింహ రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. సమస్యలు ఉన్నప్పటికీ.. మీరు విజయం సాధిస్తారు. చేసే ప్రతీ పనిలో ఇబ్బందులు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చికాకులు ఎక్కువ అవుతాయి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉంటేనే మంచిది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయండి.
కన్యా రాశి
ఈరోజు మీకు మధ్యస్త ఫలితాలు ఉంటాయి. శత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.
తులా రాశి
ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబముతో ఉల్లాసముగా గడుపుతారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు సహాయం చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. మీ అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఇష్టమైన వస్తువులు కొంటారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.
ధనూ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొంటారు. సమస్యలు పరిష్కారమవుతాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. మీ అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి.. చేసే ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా చేయండి. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.
కుంభ రాశి
ఈరోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించాల్సిన సమయమిది. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగములో సమస్యలు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.
మీన రాశి
ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
టాపిక్