తెలుగు న్యూస్  /  National International  /  Word 'Hindu' Is Persian, Has Dirty Meaning: K'taka Congress Leader

Satish Jarkiholi Hindu : ‘హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది’

07 November 2022, 19:22 IST

  • Satish Jarkiholi Hindu comments : హిందూ పదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక కాంగ్రెస్​ నేత సతీశ్​ జార్కిహోలి. ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది.

'హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది'
'హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది' (HT Photo)

'హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉంది'

Satish Jarkiholi Hindu comments : హిందూ మతంపై కర్ణాటక కాంగ్రెస్​ నేత సతీష్​ లక్షణరావ్​ జార్కిహోలి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ‘హిందూ’ పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని అన్నారు. అంతేకాకుండా.. హిందూ మతం ఇండియాది కాదని, పర్షియాలో ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇండియాతో సంబంధం లేని పదాన్ని భారతీయులు ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు.

కర్ణాటక పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు సతీశ్​ జార్కిహోలి. గత కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా.. బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హిందూ పదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

"హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అది పర్షియన్​ పదం. ఇరాన్​, ఇరాక్​, ఉజ్​బెకిస్థాన్​, కజకిస్థాన్​ల ప్రాంతం నుంచి హిందూ అనే పదం వచ్చింది. హిందూ పదానికి ఇండియాకు ఏం సంబంధం ఉంది? మరి దీనిని మనం ఎలా అంగీకరించాలి? దీనిపై చర్చ జరగాలి. అసలు 'హిందూ' అనే పదానికి అర్థం తెలిస్తే సిగ్గుపడతారు. ఆ పదానికి చాలా అసభ్యకరమైన అర్థం ఉంది," అని సతీస్​ జార్కిహోలి అన్నారు.

జార్కిహోలి ప్రసంగానికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

రాజకీయ దుమారం.

Satish Jarkiholi news : సతీశ్​ జార్కిహోలి వ్యాఖ్యలపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్​పై అధికార బీజేపీ తీవ్రంగా మండిపడింది. ప్రజల మనోభావలకు విలువనివ్వడం నేర్చుకోవాలని పిలుపునిచ్చింది. సతీశ్​ జార్కిహోలి వ్యాఖ్యలు ఖండించింది. ప్రజల్లో అనిశ్చితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించకూడదని తేల్చిచెప్పింది.

సతీశ్​ జార్కిహోలి వ్యాఖ్యలను కాంగ్రెస్​ కూడా తప్పుబట్టింది.

"మతం, నమ్మకాలకు విలువనిస్తూనే ఈ దేశాన్ని కాంగ్రెస్​ పార్టీ నిర్మించింది. సతీశ్​ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము," అని ట్వీట్​ చేశారు.. సీనియర్​ కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా.