తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'Hindi Theriyathu Poda': ‘హిందీ తెరియాతు పోడా’

'Hindi theriyathu poda': ‘హిందీ తెరియాతు పోడా’

HT Telugu Desk HT Telugu

18 October 2022, 22:35 IST

  • తమిళనాడులో హిందీ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. 'Hindi theriyathu poda' ఉద్యమ రూపం దాలుస్తోంది.

హిందీకి వ్యతిరేకంగా చెన్నైలో నిరసనలు
హిందీకి వ్యతిరేకంగా చెన్నైలో నిరసనలు (ANI Picture Service)

హిందీకి వ్యతిరేకంగా చెన్నైలో నిరసనలు

'Hindi theriyathu poda': తమిళనాట కొత్తగా ప్రారంభమైన ఉద్యమం 'Hindi theriyathu poda(I dont know Hindi, go)'. అంటే, ‘నాకు హిందీ తెలియదు, పోరా’ అని అర్ధం. బలవంతంగా హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం ప్రారంభమైంది. అధికార పక్షం డీఎంకే ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం 'Hindi theriyathu poda' టీ షర్ట్ లకు తమిళనాడులో బాగా గిరాకీ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

'Hindi theriyathu poda': అసెంబ్లీ తీర్మానం

కేంద్రం రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆ కమిటీ సిఫారసులు దేశంలోని తమిళం సహా ఇతర భాషల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించింది. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం కూడా ఈ తీర్మానాన్ని బలపర్చారు. రాష్ట్రంలో తమిళం, ఇంగ్లీష్ అధికార భాషలుగా గుర్తించే ద్విభాష విధానాన్ని తాము సమర్ధిస్తామన్నారు.

'Hindi theriyathu poda': ప్రధానికి లేఖ..

హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు నిలిపేయాలని కోరుతూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఒక లేఖ రాశారు. హిందీని తమ రాష్ట్రంలో బలవంతంగా అధికార భాషగా అమలు చేయాలనుకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు.