WhatsApp edit message feature : ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లు 'ఎడిట్' చేసేయ్!
18 September 2022, 13:57 IST
- WhatsApp edit message feature in telugu : వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ను తప్పుగా టైప్ చేస్తే.. దానిని డిలీట్ చేయాల్సి వస్తోంది. కానీ త్వరలోనే వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లు 'ఎడిట్' చేసేయ్!
WhatsApp edit message feature : సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడంతా 'ఎడిట్' ఫీచర్‌పైనే చర్చ! ట్విట్టర్‌కు ఎడిట్ ఫీచర్ వస్తోంది. ఇక ఇప్పుడు వాట్సాప్‌కి కూడా ఎడిట్ ఫీచర్ వస్తోందని సమాచారం! వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను బిటా వర్షెన్‌లో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న అప్డేట్స్లో భాగంగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇంతకాలం వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ను పంపిన తర్వాత.. దానిని ఎడిట్ చేసే అప్షన్ లేదు. ఆ మెసేజ్‌ను డిలీట్ చేయాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు.. వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ పంపించిన తర్వాత కూడా దానిని ఎడిట్ చేసుకోవచ్చు. ఫలితంగా హడావుడిగా ఏవైనా మెసేజ్‌లు పంపించిన తర్వాత కూడా వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఈ విషయాన్ని వాబిటాఇన్ఫో నివేదిక పేర్కొంది.
వాస్తవానికి వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్‌పై చాలా రోజులుగా అప్డేట్ రావాల్సి ఉంది. వాట్సాప్ యూజర్స్ కూడా దీని కోసం ఎదురుచూస్తున్నారు.
WhatsApp edit message feature in telugu : నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. గూగుల్‌ప్లే బిటాలో వాట్సాప్ వర్షెన్ 2.22.20.12లో దీనిని భాగంగా చేసి పరీక్షిస్తున్నారు. దీని రిలీజ్ డేట్‌ను వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు.
వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? అన్న విషయంపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే.. ఒకవేళ మెసేజ్‌ను ఎడిట్ చేస్తే.. దాని పక్కనే 'ఎడిటెడ్' అని కనిపిస్తుందని తెలుస్తోంది. మెసేజ్ చేసిన కొంత సమయం వరకే ఈ ఫీచర్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని సమాచారం.
Whatsapp new features news : ఇండియాలో వాట్సాప్‌కు దాదాపు 50కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్స్‌కు మెరుగైన అనుభూతిని కల్పించేందుకు వాట్సాప్ నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది.