Sunita Williams space mission : చివరి నిమిషంలో.. సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్ రద్దు!
07 May 2024, 7:18 IST
- Sunita Williams Boeing : భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సునీత విలియమ్స్ స్పేస్ మిషన్ రద్దు!
Boeing Starliner launch : భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్.. చివరి నిమిషంలో రద్దు అయ్యింది. మరో వ్యోమగామితో కలిసి ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ రాకెట్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మిషన్‌ని నిలిపివేశారు!
బోయింగ్ స్టార్‌లైనర్‌కు అడుగడుగునా అడ్డంకులు..
తొలి మానవసహిత స్టార్‌లైనర్ మిషన్‌ని బోయింగ్ కంపెనీ.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కానీ ఈ మిషన్కి అడుగడుగునా అడ్డంకులు ఎదరవుతూ వచ్చాయి. ఫలితంగా.. రాకెట్ లాంచ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక అంతా సిద్ధం అనుకున్న సమయంలో.. సునీత విలియమ్స్ 3వ స్పేస్ మిషన్ రద్దు అయ్యింది. అట్లాస్ వీ రాకెట్ పైభాగంలోని వాల్వ్‌లో అనుమనాస్పద ప్రవర్తన కారణంగా.. లాంచ్‌కి కొన్ని గంటల ముందు కౌంట్‌డౌన్‌ని నిలిపివేశారు.
ఈ అట్లాస్ వీ రాకెట్‌ని.. బోయింగ్-లోక్‌హీడ్ మార్టిన్ జాయింట్ వెంచర్ అయిన యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రూపొందించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత.. కాప్సూల్లోని సిబ్బంది.. మేన్యువల్‌గా ఆపరేట్ చేసి, దీని శక్తిసామర్థ్యాలను లెక్కిస్తారు.
Sunita Williams space mission aborted : మరి ఈ లాంచ్ మళ్లీ ఎప్పుడు ఉంటుంది? అనేది బోయింగ్ ఇంకా చెప్పలేదు. కానీ బ్యాకప్ డేట్లు.. మే 7, మే10, మే11గా ఉన్నాయి.
మానవసహిత రాకెట్ లాంచ్ కోసం చాలా సంవత్సరాలుగా బోయింగ్ తీవ్రంగా కృషి చేస్తూ వచ్చింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఈ మిషన్ కోసం ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి, తిరిగి వెనక్కి రావడం.. ఈ మిషన్‌లో భాగం.
లాంచ్‌కి రెడీ అయిన సునీత విలియమ్స్, బుచ్‌లు.. సీట్లల్లో కూర్చుని లిఫ్ట్ ఆఫ్‌కు సిద్ధమయ్యారు. కానీ మిషన్‌ని రద్దు చేయాల్సి వచ్చింది.
"ఇవాల్టి లాంచ్‌ని నిలిపివేస్తున్నాము. మేము ముందు చెప్పినట్టు.. మా మొదటి ప్రాధాన్యత భద్రత. రెడీగా ఉన్నప్పుడే వెళతాము," అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ తెలిపారు.
సేఫ్టీ విషయంలో బోయింగ్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు స్టార్‌లైనర్ లాంచ్ రద్దు అవ్వడం.. కమర్షియల్ ఏవియేషన్ విభాగంపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Sunita Williams Boeing : నాసాపైనా దీని ప్రభావం ఉండొచ్చు! వ్యోమగాములను ఐఎస్ఎస్కి తీసుకెళ్లేందుకు రెండో కమర్షియల్ పార్ట్నర్ కోసం చూస్తోంది నాసా. కానీ బోయింగ్ మిషన్‌కు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవూతూనే వచ్చాయి.
2020లో తన స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌తో వ్యోమగాములను ఐఎస్ఎస్కి పంపించారు ఎలాన్ మస్క్. ఫలితంగా.. ఈ విషయంపై రష్యా మీద ఆధారపడే అవసరం తగ్గింది. చివరికి.. స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ రద్దు అయ్యింది.