తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro Space Station: అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు; స్పేస్ స్టేషన్ నిర్మించనున్న ఇస్రో

ISRO SPACE STATION: అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు; స్పేస్ స్టేషన్ నిర్మించనున్న ఇస్రో

HT Telugu Desk HT Telugu

07 October 2023, 14:20 IST

  • ISRO SPACE STATION: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ మరో శుభవార్త తెలిపారు. త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ (SPACE STATION) ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (ISRO)

ప్రతీకాత్మక చిత్రం

ISRO SPACE STATION: అంతరిక్ష పరిశోధల్లో ఇస్రో దూసుకుపోతోంది. ముఖ్యంగా, చంద్రయాన్ 3 ఘన విజయం అనంతరం వరుస ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా త్వరలో స్పేస్ స్టేషన్ ను నిర్మించబోతోంది. అలాగే, ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండే మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందిస్తోంది. ఈ వివరాలను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఆదిత్య ఎల్-1

చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత, ఇస్రో గగన్‌యాన్ మరియు శుక్రయాన్‌తో సహా పలు అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. సూర్యుడిపై ప్రయోగాలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 కూడా విజయవంతం కావడంతో, రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తు ప్రాజెక్టులపై ఇస్రో దృష్టి పెడుతోంది.

భవిష్యత్ ప్రణాళికలు

ఇస్రో భవిష్యత్ ప్రణాళికలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. భవిష్యత్తులో భారత్ తరఫున ఇస్రో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను నిర్మించబోతోందని తెలిపారు. అలాగే, ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండే మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ సామర్ధ్యాన్ని ప్రపంచం గుర్తించిందని సోమనాథ్ వ్యాఖ్యానించారు.

ఇస్రో లక్ష్యాలు

గగన్‌యాన్ మిషన్ ద్వారా మానవ అంతరిక్షయాన సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడమే కాకుండా, వారిని అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపేలా స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించాలని ఇస్రో సంకల్పించింది. ఇది విజయవంతమైతే, అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ఒక ముఖ్యమైన దశ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం