Elon Musk India visit : ఎలాన్​ మస్క్​ భారత్​ పర్యటన వాయిదా.. కారణం ఇదే..-elon musk postpones india visit over very heavy tesla obligations ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elon Musk India Visit : ఎలాన్​ మస్క్​ భారత్​ పర్యటన వాయిదా.. కారణం ఇదే..

Elon Musk India visit : ఎలాన్​ మస్క్​ భారత్​ పర్యటన వాయిదా.. కారణం ఇదే..

Sharath Chitturi HT Telugu
Apr 20, 2024 11:22 AM IST

Elon Musk India : ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత పర్యటనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​..
టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​.. (REUTERS)

Elon Musk India visit : దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లాని ఇండియాలోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లలో భారీ కుదుపు! ఇండియా ట్రిప్​ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.. టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.

'ఇండియాకు రాలేకపోతున్నా..'

"దురదృష్టవశాత్తు, టెస్లాకు సంబంధించిన భారీ బాధ్యతల కారణంగా భారత దేశ పర్యటన ఆలస్యం అవుతోంది. కానీ ఈ సంవత్సరం చివరిలోపు ఇండియాను సందర్శించడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని మస్క్.. ఏప్రిల్ 20న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్​ (ట్విట్టర్​)లో  ఒక పోస్ట్​ పెట్టారు.

భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఎదురుచూస్తున్నానని ఇదే ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా.. కొన్ని రోజుల క్రితమే (ఏప్రిల్ 10, 2024) ఎలాన్ మస్క్ తెలిపారు. ఫలితంగా.. టెస్లా చుట్టూ హైప్​ మరింత పెరిగింది. ఈ నెల 22న.. ఎలాన్​ మస్క్​, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి.

Tesla in India : ఎలాన్ మస్క్, ప్రధాని మోదీ చివరిసారిగా.. గతేడాది జూన్​లో న్యూయార్క్​లో కలుసుకున్నారు. భారత దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాల దిగుమతిపై ఉన్న పన్నులను తగ్గించాలని.. ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంది టెస్లా.

ఇదీ చూడండి:- Google Maps: ఎలక్ట్రిక్ వాహన దారులకు గుడ్ న్యూస్; త్వరలో గూగుల్ మ్యాప్స్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

హిందూ బిజినెస్​లైన్​ నివేదిక ప్రకారం.. టెస్లా భారతదేశంలో ఈవీ యూనిట్​ని స్థాపించడానికి స్థానిక భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)తో కలిసి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి టెస్లా చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు చెప్పుకొచ్చాయి.

Elon Musk Tesla India Visit : ప్రతిపాదిత 2 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ కోసం స్థలాలను అన్వేషించడానికి ఎలాన్ మస్క్ ఈ నెలలో భారతదేశానికి ఒక బృందాన్ని పంపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.

మస్క్ భారత మార్కెట్లోకి దాదాపు 3 బిలియన్ డాలర్లను ఇన్​వెస్ట్​ చేసే ప్రణాళికలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రధానంగా కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు భారీగా డబ్బును కేటాయిస్తున్నారని సమాచారం.

టెస్లాను ఆకట్టుకునేందుకు దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్​ రాష్ట్రాలు.. ఈ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకైతే.. ఎలాంటి డీల్​ ఫిక్స్​ అవ్వలేదని తెలుస్తోంది.

Elon Musk latest news : మరి.. ఎలాన్​ మస్క్​ భారత్​ పర్యటన వాయిదా పడటంతో.. ఆ ఎఫెక్ట్​, ఇండియాలో టెస్లా ఏర్పాటుపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఏదేమైనా.. ఇండియాలో టెస్లా వ్యవహారం.. గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. టెస్లా వాహనాలు ఎప్పుడెప్పుడు ఇండియా రోడ్లపై తిరుగుతాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. మరి ఈ నిరీక్షణ.. ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం