How to read deleted messages in WhatsApp : వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్‌లు చదవడం ఎలా?
How to read deleted messages in WhatsApp : మీరు చాట్ చేసేవారు.. మెసేజ్ చేసి డిలీట్ చేసేస్తున్నారా? ఏం డిలీట్ చేశారో తెలుసుకోవాలన్న కుతుహలం మీకు ఉంటోందా? అయితే.. వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఇలా సులభంగా చదివేయండి.
How to read deleted messages in WhatsApp : 'వాట్సాప్'.. ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో ఈ యాప్.. ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది. లోకేషన్ షేరింగ్ నుంచి.. బిజినెస్ డీల్స్, పబ్లిసిటీ వరకు ఇప్పుడు అన్నీ వాట్సాప్‌లోనే జరిగిపోతున్నాయి. ఇక బంధువులు, స్నేహితులతో వాట్సాప్‌లో చేసే చాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వాట్సాప్‌లో మెసేజెస్ డిలీట్ చేసే ఆప్షన్ ఉందని అందరికి తెలుసు. కొన్నిసార్లు ఇలా డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవాలని మనకు కుతుహలంగా ఉంటుంది. అసలు ఏం పంపారు? ఎందుకు డిలీట్ చేశారు? అని చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ ఒక్కసారి డిలీట్ చేసిన మెసేజ్‌ను.. రిసీవర్ చూడలేరు అని చాలా మంది భావిస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్‌లు చదవడం చాలా సింపుల్. కేవలం 5 స్టెప్స్ పాటించి.. వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్‌లను చదివేయవచ్చు.
వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్‌లు చదవడం ఎలా అంటే..
- Whatsapp deleted messages : స్టెప్ 1:- ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి.
- స్టెప్ 2:- సెర్చ్‌లో నోటిఫికేషన్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు 'నోటిఫికేషన్ హిస్టరీ' కనిపిస్తుంది.
- స్టెప్ 3:- అందులో మీకు మళ్లీ 'నోటిఫికేషన్ హిస్టరీ' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.
- స్టెప్ 4:- అందులో.. వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌ల నోటిఫికేషన్లు దర్శనమిస్తాయి. అక్కడే వాట్సాప్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి.
- స్టెప్ 5:- వాట్సాప్ మీద ట్యాప్ చేయాలి. ఆ వెంటనే.. డిలీటెడ్ మెసేజ్‌లు కనిపిస్తాయి.
ఈ విధంగా.. మీ స్నేహితులు, బంధువులు లేదా ఇంకెవరైనా.. మీకు మెసేజ్ చేసి డిలీట్ చేసేస్తే.. వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్‌లను ఇలా చదివేయండి.
Whatsapp latest tricks : యూజర్స్‌కు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మెటా సంస్థ నియంత్రణలో ఉన్న వాట్సాప్ మరో రెండు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లకు కూడా త్వరలో అందుబాటులోకి తేనుంది. అందులో ఒకటి స్క్రీన్‌షాట్ బ్లాకింగ్. ఈ ఫీచర్‌ను ఇనేబుల్ చేయడం ద్వారా మన చాట్ లేదా మన ఫొటోస్‌ను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నియంత్రించవచ్చు.
ఇక చాలా గ్రూప్‌ల్లో మనల్ని యాడ్ చేస్తుంటారు. ఆ గ్రూప్‌లో కొనసాగడం మనకు ఇష్టం లేకపోయినా, గ్రూప్ నుంచి లీవ్ అయితే, ఏమన్నా అనుకుంటారేమోనన్న ఆలోచనతో గ్రూప్‌లో కొనసాగుతుంటాం. వారికి తెలియకుండా ఆ గ్రూప్ నుంచి లీవ్ అయితే బావుండన్న ఆలోచన మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. అలాంటి వారి కోసం వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకువస్తోంది. అది సైలెంట్ గ్రూప్ లీవింగ్. ఈ ఆప్షన్ ద్వారా ఆ గ్రూప్‌లోని వారికి తెలియకుండానే అందులో నుంచి బయటకు వచ్చేయొచ్చు.
సంబంధిత కథనం