Whatsapp tricks : వాట్సాప్‌లో `ఆన్‌లైన్ స్టేట‌స్‌`ను దాచేయొచ్చు ఇలా..!-whatsapp users will be able to hide their online status soon here is how ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Whatsapp Tricks : వాట్సాప్‌లో `ఆన్‌లైన్ స్టేట‌స్‌`ను దాచేయొచ్చు ఇలా..!

Whatsapp tricks : వాట్సాప్‌లో `ఆన్‌లైన్ స్టేట‌స్‌`ను దాచేయొచ్చు ఇలా..!

Sudarshan Vaddanam HT Telugu
Aug 25, 2022 05:33 PM IST

స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఇప్పుడు ఒక నిత్యావ‌స‌రం. ఆఫీస్ గ్రూప్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఫ్రెండ్స్‌, స్కూల్ అసైన్‌మెంట్స్‌.. ఇలా ఎన్నో క‌మ్యూనికేష‌న్ అవ‌స‌రాల‌ను వాట్సాప్ తీరుస్తోంది. వాట్సాప్ సంస్థ కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Whatsapp tricks : వాట్సాప్‌కు పోటీగా చాలా మెసేజింగ్ యాప్స్ వ‌చ్చాయి. కానీ, అవి వాట్సాప్ స్థాయిలో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల అవ‌స‌రాల‌ను గుర్తించి, త‌ద‌నుగుణంగా కొత్త ఫీచ‌ర్ల‌ను, కొత్త అప్‌డేట్స్‌ను తీసుకువ‌స్తుండ‌డ‌మే.

Whatsapp tricks : ఆన్‌లైన్ స్టేట‌స్ హైడింగ్‌

తాజాగా మ‌రో మూడు కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తోంది వాట్సాప్‌. ప్ర‌స్తుతం ఆ ఫీచ‌ర్ల‌ను టెస్ట్ చేస్తోంది. అందులో ఒక‌టి ఆన్‌లైన్ స్టేట‌స్‌ను దాచేయ‌డం. సాధార‌ణంగా మ‌నం వాట్సాప్ ఓపెన్ చేయ‌గానే.. మ‌న కాంటాక్ట్స్‌లో ఉన్న‌వారికి మ‌నం ఆన్‌లైన్‌లో ఉన్న‌ట్లుగా స్టేట‌స్ క‌నిపిస్తుంటుంది. మ‌నం అలా ఆన్‌లైన్‌లో ఉన్న‌ట్లు క‌నిపించ‌కూడ‌దు అని కోరుకునేవారు చాలా మంది ఉంటారు మ‌న‌లో. ఆన్‌లైన్‌లో ఉన్న‌ట్లు క‌నిపించ‌కుండానే, వాట్సాప్ యాక్టివిటీస్‌ను కొన‌సాగించాల‌ని ఆశిస్తుంటాం. అలాంటి వారికోస‌మే ఈ ఫీచ‌ర్‌. ఈ ఆప్ష‌న్ ఇనేబుల్ చేసుకుంటే.. అంద‌రికీ కానీ, లేదా ఎంపిక చేసుకున్న కాంటాక్ట్స్‌ కానీ మ‌న ఆన్‌లైన్ స్టేటస్ క‌నిపించ‌దు. ఈ ఫీచ‌ర్‌ను ఈ నెలాఖ‌రు నాటికి క్ర‌మంగా యూజ‌ర్లు అంద‌రికీ అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని వాట్సాప్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Whatsapp tricks : ఈ ఆప్ష‌న్‌ను ఇలా ఎనేబుల్ చేసుకోవాలి

- వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి

- సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి

- అకౌంట్ ఆప్ష‌న్ ఓపెన్ చేయాలి

- ప్రైవ‌సీ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి

- అక్క‌డ “Who can see when I’m online” అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

- దానిపై ట్యాప్ చేయాలి

- అప్పుడు రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఒక‌టి “Everyone” మ‌రొక‌టి “Same as last seen”

- “Same as last seen”ను సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఎవ‌రికైతే లాస్ట్ సీన్ ఆప్ష‌న్‌ను డిసేబుల్ చేశారో వారికి మాత్రం ఆన్‌లైన్ స్టేట‌స్ క‌నిపించ‌దు

- మీరు “Everyone” ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకుంటే, మీ ఆన్‌లైన్ స్టేట‌స్ మీ కాంటాక్ట్స్‌లోని ఎవ‌రికీ క‌నిపించ‌దు.

Whatsapp tricks : స్క్రీన్‌షాట్ బ్లాకింగ్

మెటా సంస్థ నియంత్ర‌ణ‌లో ఉన్న వాట్సాప్ మ‌రో రెండు యూజ‌ర్ ఫ్రెండ్లీ ఫీచ‌ర్ల‌కు కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి తేనుంది. అందులో ఒక‌టి స్క్రీన్‌షాట్ బ్లాకింగ్. ఈ ఫీచ‌ర్‌ను ఇనేబుల్ చేయ‌డం ద్వారా మ‌న చాట్ లేదా మ‌న ఫొటోస్‌ను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నియంత్రించ‌వ‌చ్చు.

Whatsapp tricks : గ్రూప్ లీవింగ్‌

చాలా గ్రూప్‌ల్లో మ‌నల్ని యాడ్ చేస్తుంటారు. ఆ గ్రూప్‌లో కొన‌సాగ‌డం మ‌న‌కు ఇష్టం లేక‌పోయినా, గ్రూప్ నుంచి లీవ్ అయితే, ఏమ‌న్నా అనుకుంటారేమోన‌న్న ఆలోచ‌న‌తో గ్రూప్‌లో కొన‌సాగుతుంటాం. వారికి తెలియ‌కుండా ఆ గ్రూప్ నుంచి లీవ్ అయితే బావుండ‌న్న ఆలోచ‌న మ‌న‌లో చాలా మందికి వ‌చ్చి ఉంటుంది. అలాంటి వారి కోసం వాట్సాప్ ఈ ఫీచ‌ర్ తీసుకువ‌స్తోంది. అది సైలెంట్ గ్రూప్ లీవింగ్‌. ఈ ఆప్ష‌న్ ద్వారా ఆ గ్రూప్‌లోని వారికి తెలియ‌కుండానే అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయొచ్చు.

Whatsapp tricks : మొత్తం మూడు కొత్త ఫీచ‌ర్లు

ఈ మూడు ఆప్ష‌న్లు ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉన్నాయ‌ని, ఈ నెలాఖ‌రు నుంచి క్ర‌మంగా యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని వాట్సాప్ ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ స్టేట‌స్‌ను క‌నిపించ‌కుండా చేసే ఆప్ష‌న్‌ను మొద‌ట iOS, Android ల్లోని బీటా యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తారు. త‌రువాత అంద‌రికీ అందిస్తారు.

IPL_Entry_Point