తెలుగు న్యూస్  /  National International  /  Reactions, 2gb File Sharing, 512 Groups; Check These New Features In Whatsapp

WhatsApp Updates: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

HT Telugu Desk HT Telugu

03 September 2022, 17:11 IST

  • WhatsApp Updates: ఎప్పటికప్పుడు సరికొత్త, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రైవసీ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ ఎలాంటి రాజీ లేకుండా, నాణ్యమైన సేవలను యూజర్లకు అందిస్తోంది.

వాట్సాప్ లోగో
వాట్సాప్ లోగో

వాట్సాప్ లోగో

WhatsApp Updates: నాణ్యమైన, సురక్షిత సేవలను సులభంగా, వేగంగా అందించే విషయంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే తాజాగా మూడు ఫెసిలిటీస్ ను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

WhatsApp Updates: ఎమోజీ రియాక్షన్స్

వాట్సాప్ లో ఇప్పుడు ఫుల్ ఎమోజీ కీ బోర్డ్ సిద్ధంగా ఉంది. ఇందులో నుంచి వినియోగదారుడు తనకు అవసరమైన ఎమోజీని వాడుకోవచ్చు. గతంలో కన్నా అత్యధిక సంఖ్యలో ఎమోజీ రియాక్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తమ ఎమోషనల్ రియాక్షన్లను ఎమోజీలుగా ఇన్ స్టంట్ గా పంపేందుకు ఇవి ఉపయోగపడ్తాయి. కొత్త కొత్త ఎమోజీ రియాక్షన్లను యాడ్ చేస్తూనే ఉంటామని వాట్సాప్ వెల్లడించింది.

WhatsApp Updates: 2జీబీ వరకు ఫైల్ ట్రాన్స్ ఫర్

వాట్సాప్ లో ఇప్పటివరకు 100 ఎంబీ సైజ్ లోపు ఉన్న ఫైళ్లను మాత్రమే పంపడానికి వీలయ్యేది. దీనిపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, సిఫారసులు రావడంతో ఫైల్ సైజ్ ను పెంచాలని వాట్సాప్ నిర్ణయించింది. ఇప్పుడు వినియోగదారులు, గ్రూప్ లు అత్యధికంగా 2జీబీ సైజ్ వరకు ఉన్న ఫైళ్లను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. చిన్న వ్యాపారాలకు, స్కూల్ గ్రూప్ లకు ఇది సౌలభ్యంగా ఉంటుందని వాట్సాప్ సూచించింది. అయితే, ఈ సైజు ఫైళ్లను వైఫై ద్వారానే ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని సూచించింది. అలాగే, సదరు ఫైల్ అప్ లోడింగ్ లేదా డౌన్ లోడింగ్ కు ఎంత సమయం పడుతుందో కూడా వాట్సాప్ స్క్రీన్ పై కనిపిస్తుందని వెల్లడించింది.

WhatsApp Updates: గ్రూప్ సభ్యుల సంఖ్య పెంపు..

వాట్సాప్ నుంచి వచ్చిన మరో యూజర్ ఫ్రెండ్లీ అప్ డేట్ ఇది. వాట్సాప్ యూజర్ల నుంచి అత్యధిక రిక్వెస్ట్ లు వచ్చిన అప్ డేట్ కూడా ఇదే. వాట్సాప్ గ్రూప్ సభ్యుల గరిష్ట పరిమితిని పెంచాలన్నదే ఆ రిక్వెస్ట్. తాజాగా, వాట్సాప్ ఆ అవకాశం కూడా వాట్సాప్ కల్పించింది. ఇప్పుడు గరిష్టంగా 512 మంది సభ్యులను గ్రూప్ లో చేర్చుకోవచ్చు. ఈ మూడు అప్ డేట్స్ కూడా వాట్సాప్ కొత్త వర్షన్లో అందుబాటులో ఉన్నాయి.