తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru News: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

HT Telugu Desk HT Telugu

01 May 2024, 13:19 IST

  • Zero rainfall in Bengaluru: నీటి కటకటతో సతమతమవుతున్న బెంగళూరు కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ వేసవి బెంగళూరు వాసులను మాడ్చేస్తోంది. బెంగళూరులో గత నలభై సంవత్సరాలలో ఏప్రిల్ నెలలో గణనీయ స్థాయిలో ఒక్క వాన కూడా పడని సంవత్సరంగా 2024 నిలిచింది.

బెంగళూరులో మే 3 వరకు వర్షాలు
బెంగళూరులో మే 3 వరకు వర్షాలు

బెంగళూరులో మే 3 వరకు వర్షాలు

బెంగళూరు వాసులకు ఈ ఏప్రిల్ మరో విధంగా కూడా గుర్తుండిపోతుంది. చుక్క నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న నగర వాసుల కష్టాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో బెంగళూరులో ఒక్క వాన కూడా పడలేదు. దాంతో, గత నాలుగు దశాబ్దాలలో అత్యంత పొడి ఏప్రిల్ గా 2024 ఏప్రిల్ నిలుస్తోంది. చివరిసారిగా 1983 ఏప్రిల్ లో నగరంలో సున్నా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 19, 20 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసినా నగరంలోని ఐఎండీ అబ్జర్వేటరీలో నమోదు కాలేదు.

ట్రెండింగ్ వార్తలు

London-Singapore flight : ఆకాశంలో ఉండగా విమానంలో భారీ కుదుపు.. ఒకరు మృతి- 30మందికి గాయాలు!

UK Blood scandal report : బ్రిటన్​ని కుదిపేస్తున్న ‘రక్తం కుంభకోణం’- 30వేల మందికి హెచ్​ఐవీ ఎలా సోకింది?

Chitta Ranjan Dash : ‘ఇప్పటికీ.. ఎప్పటికీ నేను ఆర్​ఎస్​ఎస్​ సభ్యుడినే’- హైకోర్టు జడ్జి!

Ebrahim Raisi death : ఇరాన్​ అధ్యక్షుడు రైసీని ఇజ్రాయెల్​ చంపేసిందా?

సున్నా వర్షపాతం

‘‘గత 41 సంవత్సరాలలో, బెంగళూరులో ఏప్రిల్లో వర్షాలు పడకపోవడం ఇదే మొదటిసారి. అసాధారణ వేడికి కారణమైన ఎల్ నినో తటస్థంగా లేదా సున్నాగా మారే అవకాశం ఉంది. లా నినా పరిస్థితి ప్రారంభమైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఐఎండీ లో సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న ప్రసాద్ వివరించారు. గ్లోబల్ వార్మింగ్, వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, ఎల్ నినో వంటివి టెక్ రాజధాని బెంగళూరులో ఈ కఠిన వాతావరణ పరిస్థితులకు కారణాలని ఆయన వివరించారు.

మండుతున్న బెంగళూరు

ఆదివారం బెంగళూరులో 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత ఐదు దశాబ్దాలలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రతగా చెబుతారు. 2016 ఏప్రిల్ 25న బెంగళూరులో నమోదైన 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నగరంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డుగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న 38.5 డిగ్రీలు, ఏప్రిల్ 27న 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రానున్న రెండు రోజులు వర్షాలు

బెంగళూరు వాసులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. మే 3 తేదీ లోపు బెంగళూరు అర్బన్, విజయపుర, హసన్, చిత్రదుర్గ, రాయచూర్, బెళగావి, బళ్లారి, దావణగెరె, శివమొగ్గ, తుమకూరు, బీదర్, కలబుర్గి, యాద్గిర్, చిక్కమగళూరు, చామరాజనగర్, రామనగర, మండ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తదుపరి వ్యాసం