AP Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్-atmakur temperature recorded at 46 degrees warning for 61 mandals today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్

AP Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్

Sarath chandra.B HT Telugu
Apr 30, 2024 06:14 AM IST

AP Summer Upadtes: ఆత్మకూరులో ఎండలు అదరగొట్టేశాయి. సోమవారం 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు
ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు (unsplash.com)

AP Summer Upadtes: ఎండ దెబ్బకు సోమవారం ఆత్మకూరు Atmakur అల్లాడిపోయింది. AP ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో Temparature ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం nandyala నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 45.9°డిగ్రీలు, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.1°డిగ్రీలు, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8°డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 44.5°డిగ్రీలు, నెల్లూరు జిల్లా రాపూరులో 44.4°డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలో 44.3°డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం ఏపీలోని 61 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, బుధవారం 90మండలాల్లో తీవ్రవడగాల్పులు,202 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ SDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

మంగళవారం తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు

శ్రీకాకుళం జిల్లాలో 13 , విజయనగరంలో 24, పార్వతీపురంమన్యంలో 14 , అనకాపల్లిలో 9, విశాఖ పద్మనాభం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఎస్‌డిఎంఏ అధికారులు తెలిపారు.

మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(173):-

శ్రీకాకుళం జిల్లాలో 13 , విజయనగరంలో 3, పార్వతీపురంమన్యంలో 1, అల్లూరి సీతారామరాజులో 9, విశాఖపట్నంలో 2 , అనకాపల్లిలో 9, కాకినాడలో 19, కోనసీమలో 7, తూర్పుగోదావరిలో 18, పశ్చిమగోదావరిలో 3, ఏలూరులో 12, కృష్ణాలో 10, ఎన్టీఆర్ లో 6, గుంటూరులో 15, పల్నాడులో 19, బాపట్లలో 4, ప్రకాశంలో 16, తిరుపతిలో 4, అన్నమయ్య 1, నెల్లూరులో 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని 59 మండలాల్లో సోమవారం తీవ్రవడగాల్పులు,78 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి.

వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం