TS Weather Updates : తెలంగాణలో రాగల 4 రోజులు వడగాల్పులు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ - మరోవైపు ఎల్లుండి నుంచి వర్షాలు..!-imd issues heatwave alert in telangana for 3 days also chance of light rains latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Weather Updates : తెలంగాణలో రాగల 4 రోజులు వడగాల్పులు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ - మరోవైపు ఎల్లుండి నుంచి వర్షాలు..!

TS Weather Updates : తెలంగాణలో రాగల 4 రోజులు వడగాల్పులు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ - మరోవైపు ఎల్లుండి నుంచి వర్షాలు..!

Apr 26, 2024, 06:36 PM IST Maheshwaram Mahendra Chary
Apr 26, 2024, 06:23 PM , IST

  • TS AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉన్నాయి. పలు చోట్ల వడగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల ఏకంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే తెలంగాణలో రాగల 4  రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 

(1 / 6)

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. (photo source from https://unsplash.com/)

వడగాలుల హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో…. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

(2 / 6)

వడగాలుల హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో…. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.(photo source from https://unsplash.com/)

వచ్చే నాలుగైదు రోజులు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వనపర్తి జోగులాంబ జిల్లాల్లో.. శనివారం మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యా.ి

(3 / 6)

వచ్చే నాలుగైదు రోజులు తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వనపర్తి జోగులాంబ జిల్లాల్లో.. శనివారం మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యా.ి(photo source from https://unsplash.com/)

ఇక ఏప్రిల్  28వ తేదీన ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు వీస్తాయంటూ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయింది..

(4 / 6)

ఇక ఏప్రిల్  28వ తేదీన ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వడగాలులు వీస్తాయంటూ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ అయింది..(photo source from https://unsplash.com/)

ఇదే సమయంలో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఏప్రిల్ 28వ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం(ఏప్రిల్ 28)ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మే 1వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(5 / 6)

ఇదే సమయంలో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఏప్రిల్ 28వ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం(ఏప్రిల్ 28)ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మే 1వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.(photo source from https://unsplash.com/)

ఇక ఏపీలో చూస్తే… ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.

(6 / 6)

ఇక ఏపీలో చూస్తే… ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.(photo source from https://unsplash.com/)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు