Twitter’s new Edit button: ట్విటర్ యూజర్లకు కొత్తగా ఎడిట్ ఫీచర్-twitters new edit button limits users to edit tweets in a fixed time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter's New Edit Button Limits Users To Edit Tweets In A Fixed Time

Twitter’s new Edit button: ట్విటర్ యూజర్లకు కొత్తగా ఎడిట్ ఫీచర్

HT Telugu Desk HT Telugu
Sep 10, 2022 07:50 PM IST

Twitter’s new Edit button: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విటర్ తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

Twitter’s new Edit button: యూజర్లకు తమ ట్వీట్ల విషయంలో మరింత వెసులుబాటు తీసుకువచ్చే దిశగా ఒక ఎడిట్ బటన్ ఫీచర్ ను త్వరలో తీసుకురానున్నట్లు ట్విటర్ గతవారం ప్రకటించింది. ఆ వివరాలను శనివారం `టెక్ క్రంచ్` వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Twitter’s new Edit button: ఎడిట్ బటన్

ట్విటర్ యూజర్లు ట్వీట్ చేసిన తరువాత తమ పోస్ట్ ను ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఈ ఎడిట్ బటన్ ను ట్విటర్ రూపొందించింది. అయితే, ఈ ఎడిట్ ఆప్షన్ ను వాడుకునే విషయంలో కొన్ని షరతులను కూడా పొందుపర్చింది. ట్వీట్ చేసిన తరువాత యూజర్లు టైపో ఎర్రర్లను సరి చేసుకోవలన్నా, కొత్తగా మీడియా ఫైళ్లను అప్ లోడ్ చేయాలన్నా, ట్యాగ్స్ లో మార్పు చేయాలన్నా ఈ ఎడిట్ ఆప్షన్ ను వడుకోవచ్చు.

Twitter’s new Edit button: షరతులు వర్తిస్తాయి. .

అయితే, ఈ ఎడిట్ ఆప్షన్ ను వాడుకోవడానికి కొన్ని షరతులు కూడా పెట్టింది ట్విటర్. అవేంటంటే.. ట్వీట్ చేసిన తరువాత 30 నిమిషాల లోపు మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే, ఆ 30 నిమిషాల్లోపు కూడా, 5 సార్లు మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే, మొత్తంగా, ట్వీట్ పోస్ట్ చేసిన అరగంట లోపు ఐదు సార్లు మాత్రం యూజర్ తన ట్వీట్ ను ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే, ట్వీట్ చేసిన 30 సెకండ్ల లోపు ఆ ట్వీట్ ను `అన్ డూ` కూడా చేసుకోవచ్చు.

Twitter’s new Edit button: ఎవరికి ఈ సదుపాయం

మొదట ఈ సదుపాయం ఎంపిక చేసిన కొన్ని దేశాల్లోని ట్విటర్ బ్లూ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉండబోతోంది. ఆ తరువాత క్రమంగా అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తామని ట్విటర్ ప్రకటించింది.

WhatsApp channel