తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Minor Kills His Own Family : కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!

Minor kills his own family : కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!

06 November 2022, 15:39 IST

  • Minor kills his own family : ఆ బాలుడి వయస్సు 15. బడికి వెళ్లాల్సిన వయస్సులో దారుణానికి ఒడిగట్టాడు ఆ మైనర్​. తల్లితో సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది.

కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!
కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!

కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!

Minor kills his own family : త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 15ఏళ్ల బాలుడు.. సొంత కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపేశాడు! ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

కారణమేంటి..?

అగర్తలకు 90కి.మీల దూరంలో ఉంది కమల్​పూర్​. అందులోని దురై శివ్​బరీ అనే ప్రాంతంలో ఓ మైనర్​.. తన కుటుంబంతో నివాసముంటున్నాడు.

కాగా.. శనివారం అర్ధరాత్రి.. ఆ మైనర్​ బాలుడు.. తన తాత, తల్లి, సోదరితో పాటు మరో ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి చంపేశాడు. తాత వయస్సు 70ఏళ్లు. తల్లికి 32, సోదరికి 10ఏళ్ల వయస్సు ఉంటుందని తెలుస్తోంది.

హత్య చేసిన సమయంలో.. భారీ శబ్దాలతో మ్యూజిక్​ పెట్టి, కుటుంబసభ్యుల అరుపులను ఎవరికి వినిపించకుండా చేశాడు ఆ మైనర్​. కుటుంబసభ్యులను చంపేసిన తర్వాత.. వారి మృతదేహాలను ఇంటి వెనుక భాగంలో పాతేశాడు ఓ బాలుడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

ఘటన జరిగిన సమయంలో బాలుడి తండ్రి ఇంట్లో లేడు. బయట నుంచి ఇంటికి తిరిగి వెళ్లేసరికి.. ఆ తండ్రికి గదుల్లో రక్తం కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ మార్కెట్​లో పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితుడిని పట్టుకున్నారు.

"కమల్​పూర్​ పోలీస్​ స్టేషన్​లో ఓ మర్డర్​ కేసు నమోదైంది. నిందితుడిని హలాహలి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాము," అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, హత్యకు గల కారణాలను తెలుసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా.. ఇంట్లో ఆ బాలుడు దొంగతనానికి పాల్పడినట్టు తెలిసిందని అన్నారు.

ఆ బాలుడికి టీవీ చూడటం అలవాటు అని, క్రైమ్​ షోలు చాలా ఎక్కువగా చూసి ఎంజయ్​ చేసేవాడని.. స్థానికులు మీడియాకు వివరించారు.