యూపీలో దారుణ ఘటన.. ట్రక్ ఢీకొట్టడంతో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలొదిలిన మహిళ
baby comes out alive from womb: యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భర్తతో కలిసి బైక్పై గర్భిణీ వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ రోడ్డుపైనే చిన్నారికి జన్మనిచ్చి మరణించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
baby comes out alive from womb in up: ఓ కుటుంబం బైక్ పై వెళ్తోంది. ఇందులో అతని భార్య 8 నెలల గర్భిణీ. ఇంతలోనే ఓ ట్రక్.. బైక్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో... శిశువు బయటికి వచ్చింది. అంతేకాదండోయ్... ఏకంగా ప్రాణాలతో బయటపడగా.. తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే...
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 'నర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ టరా గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 26 ఏళ్ల మహిళ (8 నెలల గర్భిణీ).. బైక్ పై తన భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తోంది. ఈ క్రమంలో భర్త రాము... ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో అదుపుతప్పటంతో కిందపడిపోయారు. ప్రమాదంలో కింద పడిన భార్య కామినినీ ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో శిశువు బయటపడ్డాడు' అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బదోరియా వెల్లడంచారు.
శిశువు పరిస్థితి ఆరోగ్యకరంగా ఉందని, ప్రస్తుతానికి వైద్యం అందిస్తున్నారని బదోరియా చెప్పారు. తండ్రి రాము కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డైవర్ పారిపోయాడని... సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఆర్ఐ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
టాపిక్