తెలుగు న్యూస్  /  National International  /  Salman Khan, Akshay Kumar Get Y+ And X Category Security After Threats: Report

Salman Khan gets Y+ security: సల్మాన్ ఖాన్ హత్యకు రెక్కీ; సెక్యూరిటీ Y+కి పెంపు

HT Telugu Desk HT Telugu

01 November 2022, 15:21 IST

  • Salman Khan gets Y+ security: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ని పెంచుతూ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ను, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ ను హత్య చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్

Salman Khan gets Y+ security: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన సెక్యరిటీని Y+ కేటగిరీ(Y+ security)కి పెంచారు. గతంలో సల్మాన్ ను హత్య చేయడానికి రెండు సార్లు రెక్కీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Salman Khan gets Y+ security: Y+ కేటగిరి భద్రత

సల్మాన్ ఖాన్ కు ఇకపై Y+(Y+ security) కేటగిరి భద్రత లభిస్తుంది. అంటే, 24 గంటల పాటు షిఫ్ట్ సిస్టమ్ లో ఆయనకు నలుగురు సాయుధ పోలీసులు భద్రత కల్పిస్తుంటారు. సల్మాన్ ఖాన్ ను హత్యకు ప్లాన్ చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్రూప్ పోలీసులకు వెల్లడించింది. అంతకుముందు, ఈ జూన్ లో సల్మాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లను హత్య చేస్తామని వారికి ఒక లేఖ అందింది. పంజాబ్ లో హత్యకు గురైన ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా తరహాలో వారిని చంపేస్తామని ఆ లేఖలో హెచ్చరించారు. ఈ విషయంపై సల్మాన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Salman Khan gets Y+ security: రెక్కీ ఎప్పుడు?

సిద్ధూ మూసేవాలా(sidhu moosewala) హత్య అనంతరం, ఆ హత్యకు కుట్ర పన్ని న లారెన్స్ బిష్ణోయి గ్రూప్ లో కొందరు కీలక వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సల్మాన్ పై హత్యకు ప్లాన్ చేసిన విషయం వెల్లడయింది. 2017లో సల్మాన్ బర్త్ డే వేడుకల సమయంలో బాంద్రాలోని సల్మాన్ ఇంటి వెలుపల ఒకసారి, 2018లో సల్మాన్ కు పన్వెల్ లో ఉన్న ఫామ్ హౌజ్ లో ఒకసారి సల్మాన్ హత్య కు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయితో పాటు, గోల్డ్ బ్రార్ లు సల్మాన్ హత్య కోసం కుట్ర చేసినట్లు తెలిపారు.

Salman Khan gets Y+ security: సల్మాన్ పై కోపం ఎందుకు?

సల్మాన్ ఖాన్ పై రాజస్తాన్ లో కృష్ణ జింక(black buck)లను వేటాడి చంపేశారనే కేసు నమోదైన విషయం తెలుసు కదా? హమ్ సాథ్ సాథ్ హై‘ అనే సినిమా షూటింగ్ సందర్భంగా తన కో స్టార్ట్స్ తో కలిసి వేటకు వెళ్లిన సల్మన్ కృష్ణ జింకలను వేటాడి చంపేశారు. అయితే, ‘బిష్ణోయి’లకు కృష్ణ జింక(black buck)లు దైవంతో సమానం. వారు వాటిని పూజిస్తారు. తమకు దైవసమానమైన కృష్ణ జింకలను చంపడంపై వారు సల్మాన్ పై కోపం పెంచుకున్నారు.

Salman Khan gets Y+ security: అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ లకు కూడా..

సల్మాన్ తో పాటు బాలీవుడ్ స్టార్ లు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ ల ప్రాణాలకు కూడా ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో వారి సెక్యూరిటీని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వీరిద్దరికి X-category భద్రత కల్పించింది. అంటే, వారికి ముగ్గురు సాయుధ పోలీసులు అనునిత్యం భద్రత కల్పిస్తుంటారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా అనంతరం అనుపమ్ ఖేర్ కు, సోషల్ మీడియా పోస్ట్ లకు సంబంధించి అక్షయ్ కుమార్ కు బెదిరింపులు వచ్చాయి.