Threat letter: సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత-mumbai police beef up security at salman khan home ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mumbai Police Beef Up Security At Salman Khan Home

Threat letter: సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత

HT Telugu Desk HT Telugu
Jun 06, 2022 04:27 PM IST

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు లేఖ రావడంతో ఆయన ఇంటివద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (AFP)

ముంబై, జూన్ 6: సుప్రసిద్ధ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్‌లను చంపుతామని బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసు బృందం ఒకటి నటుడి బాంద్రా నివాసానికి వెళ్లి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆదివారం ఉదయం సలీం ఖాన్ మార్నింగ్ వాక్‌కు వెళ్లి బాంద్రా బాండ్‌స్టాండ్ వద్ద ఓ బెంచ్‌పై కూర్చుని ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లాడు. సలీంఖాన్‌ను, ఆయన కుమారుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని ఆ లేఖలో బెదిరించారు.

దీంతో సలీం ఖాన్ తన సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులను సంప్రదించి ఫిర్యాదు అందజేయడంతో బాంద్రా పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 (2) కింద కేసు నమోదు చేశారు. సోమవారం క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారుల బృందం, స్థానిక పోలీసులు సల్మాన్ ఖాన్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

 లేఖ దొరికిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. లేఖలోని బెదిరింపు తీవ్రత దృష్ట్యా ఆ అగంతకుడి ఆచూకీ కనిపెట్టేందుకు సమీపంలోని సీసీటీవీల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. 

IPL_Entry_Point

టాపిక్