Sidhu Moose Wala : గన్స్​ పట్టుకుని కారులో హంతకులు 'చిల్​'.. వీడియో వైరల్​-sidhu moose wala killers celebrate brandish guns in car ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Sidhu Moose Wala Killers Celebrate, Brandish Guns In Car

Sidhu Moose Wala : గన్స్​ పట్టుకుని కారులో హంతకులు 'చిల్​'.. వీడియో వైరల్​

Sharath Chitturi HT Telugu
Jul 04, 2022 10:10 PM IST

Sidhu Moose Wala : సిద్ధూ మూసే వాలా హంతకులకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. హత్య చేసిన కొద్దిసేపటికి.. వారందరు కారులో పంజాబీ పాటలు పెట్టుకుని చిందులు వేశారు.

గన్స్​ పట్టుకుని కారులో హంతకులు 'చిల్​'.. వీడియో వైరల్​
గన్స్​ పట్టుకుని కారులో హంతకులు 'చిల్​'.. వీడియో వైరల్​ (Twitter)

Sidhu Moose Wala : సిద్ధూ మూసే వాలా మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఈ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. తాజాగా.. సిద్ధూ మూసే వాలా హంతకులకు సంబంధించిన వీడియో ఒకటి పోలీసుల చేతికి చిక్కింది. అది చూసినవారందరు షాక్​ అయ్యారు. సిద్ధూ మూసే వాలాను చంపిన కొద్ది సేపటికి.. అసలేం జరగనట్టు.. వారందరు కారులో ప్రయాణిస్తూ చిల్​ అయ్యారు.

హంతకుల్లో అతి పిన్నవయస్కుడైన అంకిత్​ సిర్సా ఫోన్​లో ఈ దృశ్యాలు పోలీసులకు కనిపించాయి. సిద్ధూ మూసే వాలా హంతకులు కారులో ఎక్కారు. పంజాబీ పాటలు పెట్టుకుని ఎంజాయ్​ చేశారు. 10కిపైగా గన్స్​ను చేతుల్లో పట్టుకుని విజయోత్సాహంతో ఊగిపోయారు.

ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

దారుణ హత్య..

సింగర్​, రాపర్​గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సిద్ధూ మూసే వాలా.. మే 29న దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్​ మాన్సాలోని స్వగ్రామంలో కారులో బయటకు వెళ్లిన ఆయన్ని.. మరో వాహనం అడ్డుకుంది. వాహనం నుంచి బయటకు దిగిన దుండగులు.. సిద్ధూ మూసే వాలాను చంపేశారు. అతని శరీరంలో నుంచి దాదాపు 30 బుల్లెట్లను వైద్యులు బయటకి తీసినట్టు సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్