Crime | దుండగుల కాల్పుల్లో ప్రముఖ సింగర్​ దుర్మరణం-punjabi singer sidhu moosewala shot dead day after security withdrawn ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime | దుండగుల కాల్పుల్లో ప్రముఖ సింగర్​ దుర్మరణం

Crime | దుండగుల కాల్పుల్లో ప్రముఖ సింగర్​ దుర్మరణం

HT Telugu Desk HT Telugu
May 29, 2022 06:58 PM IST

పంజాబ్​లోని మాన్స జిల్లాలో ప్రముఖ సింగర్​ సిద్ధూపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మరణించారు.

కాల్పుల్లో ప్రముఖ సింగర్​ మృతి
కాల్పుల్లో ప్రముఖ సింగర్​ మృతి (HT Telugu)

Sidhu Moose Wala | పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా.. ఆదివారం జరిగిన కాల్పుల్లో దుర్మరణం చెందారు. మాన్స జిల్లాలోని జవాహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 424మందికి పంజాబ్​ పోలీసులు.. భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.

సిద్ధూ ప్రయాణిస్తున్న వాహనంపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సింగర్​ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడినట్టు సమాచారం.

2022 పంజాబ్​ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ టికెట్​ మీద మాన్స నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సిద్ధూ. కానీ ఆప్​ అభ్యర్థి విజయ్​ సింగ్లా చేతిలో దారుణంగా ఓడిపోయారు.

సిద్ధూ పూర్తిపేరు.. సుభ్​దీప్​ సింగ్​ సిద్ధూ. 1993 జూన్​ 17న.. మూసేవాల గ్రామంలో ఆయన జన్మించారు. తన పాటలు, ర్యాప్​లతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

కాగా.. ఇటీవలే ఆయన వార్తల్లో నిలిచారు. ఆప్ ప్రభుత్వం​పై వివాదాస్పద పాట 'స్కేప్​గోట్​' పాడి వార్తలకెక్కారు. ఆప్​ మద్దతుదారులను దేశద్రోహులుగా ఆ పాటలో అభివర్ణించారు.

భద్రతను ఎందుకు తొలగించారు?

వీఐపీ కల్చర్​కు స్వస్తి చెప్పాలన్న కారణంతో 424మందికి భద్రతను తొలగించింది ముఖ్యమంత్రి భగవంత్​ మన్​ ప్రభుత్వం. వీరిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

అంతకుముందు.. 184మంది మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను తొలగించింది ప్రభుత్వం. దాని కన్నా ముందు 122మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను కూడా తీసిపడేసింది.

<p>సిద్ధూ మూసేవాలా</p>
సిద్ధూ మూసేవాలా (Instagram)
IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్