తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament Session : షెడ్యూల్​ కన్నా ముందే.. పార్లమెంట్​ సమావేశాలకు ముగింపు!

Parliament session : షెడ్యూల్​ కన్నా ముందే.. పార్లమెంట్​ సమావేశాలకు ముగింపు!

Sharath Chitturi HT Telugu

06 August 2022, 8:27 IST

    • Parliament monsoon session : సోమవారంతో పార్లమెంట్​ సమావేశాలు ముగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్​ ప్రకారం.. 12వ తేదీ వరకు సమావేశాలు జరగాల్సి ఉంది.
నాలుగు రోజుల ముందే పార్లమెంట్​ సమావేశాలకు ముగింపు!
నాలుగు రోజుల ముందే పార్లమెంట్​ సమావేశాలకు ముగింపు! (ANI)

నాలుగు రోజుల ముందే పార్లమెంట్​ సమావేశాలకు ముగింపు!

Parliament monsoon session : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలను.. షెడ్యూల్​ కన్నా ముందే ముగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం లేదా బుధవారంతో సమావేశాలకు ముగింపు పలకాలని భావిస్తున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

జులై 18న ప్రారంభమైన పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలను.. షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 12న ముగించాల్సి ఉంది. అయితే.. వచ్చే వారంలో రెండు రోజులు సెలవులు(ముహ్హరం, రక్షాబంధన్​) ఉన్నాయి. ఈ లెక్కన.. ఉభయ సభలకు ఇంకా మూడు వర్కింగ్​ డేలు ఉన్నట్టు! అందువల్ల.. ఈ నెల 8,10న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలను ముగించాలని కేంద్రం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విపక్షాలకు కూడా నోటీసులు అందినట్టు పేర్కొన్నాయి.

వాస్తవానికి.. పార్లమెంట్​ సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు సరిగ్గా జరగలేదు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది.

మరోవైపు విపక్షాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సోమవారం తొలి భాగంలో రాజ్యసభ కార్యకలాపాలు సాగకపోవచ్చు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలికేందుకు.. రాజ్యసభలో సోమవారం జరగాల్సిన క్వశ్చన్​ హవర్​, జీరో హవర్​ను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. రెండో భాగంలో.. పలు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10న ముగియనుంది. శనివారం నూతన ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది.