తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parliament News | `బ్యాంకుల ప్రైవేటైజేష‌న్ ఇప్ప‌ట్లో లేదు`

Parliament news | `బ్యాంకుల ప్రైవేటైజేష‌న్ ఇప్ప‌ట్లో లేదు`

HT Telugu Desk HT Telugu

02 August 2022, 21:08 IST

  • Parliament news | ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ్తున్న సమ‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటైజేష‌న్ కు సంబంధించిన‌ బిల్లును ఈ వ‌ర్షాకాల స‌మావేశాల్లో పార్ల‌మెంట్లో ప్ర‌వేశ‌పెట్డడం లేద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Parliament news | రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటైజ్ చేయాల‌నే ప్ర‌తిపాద‌న ఉన్న‌ట్లు 2021-22 బ‌డ్జెట్ లో ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ముందుగా ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల‌ను ప్రైవేటైజ్ చేయాల‌ని, ఆ తరువాత ఎస్‌బీఐ మిన‌హా అన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటైజ్ చేయాల‌ని నీతి ఆయోగ్ ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది. ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌లో ప్ర‌భుత్వ వాటా 96.38%, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్ర‌భుత్వ వాటా 93.08%గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Parliament news | ప్ర‌స్తుతానికి ఆ బిల్లు లేదు

ఈ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటైజ్ చేసే బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌డం లేద‌ని కేంద్ర ఆర్థికశాఖ స‌హాయ‌మంత్రి కే కరాడ్ పార్ల‌మెంటుకు తెలిపారు. అలాగే, ఎస్‌బీఐ మిన‌హా అన్ని ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌ను ప్రైవేటైజ్ చేయాల‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌ధాన మంత్రి స‌ల‌హాలిచ్చే క‌మిటీ(Economic Advisory Council to Prime Minister - EAC-PM) ఎలాంటి సిఫార‌సు చేయ‌లేద‌న్నారు.

Parliament news | ముద్ర రుణాలు

ముద్ర యోజ‌న లో భాగంగా (Pradhan Mantri Mudra Yojana - PMMY) గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో రూ. 9.98 కోట్ల రుణాల‌ను బ్యాంకులు అర్హులైన 16.67 కోట్ల మందికి అందించాయ‌ని మ‌రో ప్ర‌శ్న‌కు జ‌వాబుగా క‌రాడ్ స‌భ‌కు తెలిపారు. 2021-22 ఆర్థి సంవ‌త్స‌రంలో రూ. 3.39 కోట్ల‌ను సుమారు ఐదున్న‌ర కోట్ల మందికి అందించామ‌న్నారు. ఈ రుణాల కార‌ణంగా గ‌త మూడేళ్ల‌లో అద‌నంగా 1.12 కోట్ల మంది ఉపాధి సంపాదించార‌ని వెల్ల‌డించారు.