తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Langya Henipavirus : చైనాలో ‘కొత్త ’ వైరస్​.. 35మందికి పాజిటివ్​!

Langya Henipavirus : చైనాలో ‘కొత్త ’ వైరస్​.. 35మందికి పాజిటివ్​!

Sharath Chitturi HT Telugu

08 August 2022, 17:49 IST

    • Langya Henipavirus : చైనాలో కొత్త వైరస్​ వెలుగులోకి వచ్చింది. దానిని లాంగ్యా హెనిపావైరస్​ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.
చైనాలో మరొ ‘కొత్త ’ వైరస్​.. 35మందికి పాజిటివ్​!
చైనాలో మరొ ‘కొత్త ’ వైరస్​.. 35మందికి పాజిటివ్​! (Bloomberg)

చైనాలో మరొ ‘కొత్త ’ వైరస్​.. 35మందికి పాజిటివ్​!

Langya Henipavirus : కొవిడ్​, మంకీపాక్స్​తో అల్లాడిపోతున్న ప్రపంచానికి మరో బ్యాడ్​ న్యూస్​! చైనాలో కొత్తగా మరో వైరస్​ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 35మంది ఈ వైరస్​ బారినపడినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఈ కొత్త వైరస్​ను 'లాంగ్యా హెనిపావైరస్​'(లాయ్​వీ)గా పిలుస్తున్నారు. చైనాలోని రెండు రాష్ట్రాల్లో(షాంగ్​డాంగ్​, హెనాన్​) దీనిని గుర్తించారు. కొవిడ్​లాగే.. ఇది కూడా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తీవ్ర జ్వరం, నొప్పులు, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, వికారం వంటివి ఈ ల్యాంగ్యా హెనిపావైరస్​ లక్షణాలు.

"తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోగుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఒక రోగిలో లాంగ్యా హెనిపావైరస్​ను గుర్తించారు. ఆ తర్వాత విస్తృతంగా నిర్వహించిన పరీక్షల్లో.. 35మందికి ఈ వైరస్​ సోకినట్టు నిర్ధరణ చేశారు," అని న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురితమైన ఓ అధ్యయనం​ పేర్కొంది.

బీజింగ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మైక్రోబయాలజీ అండ్​ ఎపిడమాలజీ, క్వింగ్​డా మున్సిపల్​ సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​, డ్యూక్​- నేషనల్​ వర్సిటీ ఆఫ్​ సింగపూర్​ మెడికల్​ స్కూల్​ అండ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఇన్ఫెక్షన్​ అండ్​ ఇమ్యూనిటీకి చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని రూపొందించారు.

"ఈ వైరస్​.. నిపా వైరస్​తో పోలి ఉంది. ఇప్పటి వరకు వెలుగుచూసిన కేసుల్లో తీవ్ర పరిస్థితులు కనిపించలేదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి," అని సింగపూర్​ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన వంగ్​ లింఫ వెల్లడించారు.