monkeypox: మంకీపాక్స్ గుబులు.. ఆ వైరస్ సోకిన వారికి కనిపించే లక్షణాలు ఇవే!-monkeypox panic in world details of spread symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monkeypox: మంకీపాక్స్ గుబులు.. ఆ వైరస్ సోకిన వారికి కనిపించే లక్షణాలు ఇవే!

monkeypox: మంకీపాక్స్ గుబులు.. ఆ వైరస్ సోకిన వారికి కనిపించే లక్షణాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
May 20, 2022 03:15 PM IST

మంకీపాక్స్ గుబులు రేపుతోంది. కొత్త కేసులు వస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఐరోపాలోని పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూశాయి. యూకే, పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో కూడా ఈ వైరస్ బయటపడింది. తాజాగా అమెరికాలో ఓ కేసు వెలుగు చూసింది

monkeypox
monkeypox

కరోనా వైరస్ కారణంగా మహా విపత్తును ఎదుర్కొంటున్న ప్రపంచాన్ని ఇప్పుడు మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతుంది. రోజురోజుకు ఈ వైరస్ విస్తరిస్తుంది. ఇంగ్లండ్‌తో పాటు , స్పెయిన్, పోర్చుగల్ వంటి అనేక దేశాల్లో ఈ వ్యాధి రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అమెరికాలో కూడా ఈ వ్యాది క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మసాచుసైట్స్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకగా అతన్ని ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతేడాది కూడా అమెరికాలో ఈ కేసులు వెలుగు చూశాయి. మే 7న లండన్‌లో 'మంకీ పాక్స్' మొదటి కేసును గుర్తించారు.

మంకీపాక్స్ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే నిపుణులు హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నారు .

మంకీపాక్స్ వ్యాధి సోకిన వారి నుండి ఇది ఇతరులకు సోకడం చాలా తేలిక. శ్వాసనాళాలు, గాయాలు, ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా ఇది ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. తాజాగాగా మంకీపాక్స్ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించిస్తున్నారు.

మంకీపాక్స్ వైరస్ లక్షణాలు

- జ్వరం, తలనొప్పి, వెన్ను, మెడ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

- విపరీతమైన అలసట.

- శరీరంపై చిన్న చిన్న మచ్చలు కనిపించడం.

- తట్టు, గవదబిళ్లలు, స్కర్వీ, సిఫిలిస్ లక్షణాలు ఉంటాయి

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్