తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  West Nile Fever: దేశంలో మరో కొత్త వైరస్.. లక్షణాలు, చికిత్స తెలుసుకోండి!

West Nile fever: దేశంలో మరో కొత్త వైరస్.. లక్షణాలు, చికిత్స తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

29 May 2022, 17:31 IST

    • West Nile fever: దేశంలో మరో కొత్త వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్‌తో ఓ వ్యక్తి మ‌ృతి చెందడంతో..  కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
West Nile fever
West Nile fever

West Nile fever

కేరళలలో వెస్ట్ నైల్ ఫీవర్ (West Nile fever) ఆందోళన కలిగిస్తోంది. వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందే అవకాశం ఉందనే హెచ్చరికలతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. త్రిసూర్‌లో వెక్టార్-బోర్న్ డిసీజ్‌తో చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించడంతో రాష్ట్రంలో అలర్ట్ ప్రకటించారు. ఈ మధ్య కాలంలో దేశంలో నమోదైన వెస్ట్ నైలు మొదటి కేసు ఇదే. ఈ వైరస్ క్యూలెక్స్ జాతుల దోమల ద్వారా వ్యాపిస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు పుటన్‌పురక్కల్ జోబీ (47)తో సన్నిహితంగా మెగిలిన ఇద్దరు వ్యక్తులలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం వారి రక్త నమూనాలను సేకరించిన ఆర్యోగ శాఖ అధికారులు టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

వెస్ట్ నైలు జ్వరం అంటే ఏమిటి, ఇది ఎలా వ్యాపిస్తుంది?

వెస్ట్ నైల్ వైరస్ (WNV) అనేది క్యూలెక్స్ జాతికి చెందిన సోకిన దోమల ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. వ్యాధి సోకిన పక్షులను దోమలు కుట్టినప్పుడ ఈ వైరస్ వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ వైరస్ సోకిన దోమలు మనుషులను, ఇతర జంతువులను కుట్టడం ద్వారా వెస్ట్ నైల్ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, వెస్ట్ నైల్ వైరస్ చాలా తక్కువ సంఖ్యలో కేసులను ప్రయోగశాలలో గుర్తించినట్లు, రక్త మార్పిడి, అవయవ మార్పిడి గర్భధారణ సమయంలో తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్ వ్యాపించినట్లు గుర్తించనట్లు తెలిపారు.

వెస్ట్ నైలు జ్వరం లక్షణాలు

WNV సోకిన చాలా మంది వ్యక్తులు (10 లో 8 మంది) ఎటువంటి లక్షణాలు కనిపించవు. వైరస్ బారిన పడిన ప్రతి 5 మందిలో ఒకరికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా దద్దుర్లతో కూడా జ్వరం రావచ్చు. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు, అయితే వ్యాధి తగ్గిన తర్వాత అలసట, బలహీనత వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుంది. CDC ప్రకారం, WNV సోకిన 150 మందిలో ఒకరికి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితమై తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతారు. మెదడు వాపు లేదా మెనింజైటిస్ (మెదడు వెన్నుపాము చుట్టూ ఉండే పొరల వాపు) వంటివి ఏర్పడుతుంది.

వెస్ట్ నైలు వ్యాధి చికిత్స

వెస్ట్ నైల్ వైరస్‌కు టీకా, మందులు అందుబాటులో లేవు.

ఓవర్-ది-కౌంటర్ ఈ వైరస్ ద్వారా ఏర్పడే నొప్పి, జ్వరాన్ని తగ్గించడానికి, కొన్ని లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతాయి.

వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో, ఇంట్రావీనస్ లిక్విడ్, నొప్పి మందులు, నర్సింగ్ కేర్ వంటి సహాయక చికిత్సను పొందడానికి రోగులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.

మీకు లేదా కుటుంబ సభ్యులకు వెస్ట్ నైల్ వైరస్ వ్యాధి ఉందని భావిస్తే, డాక్టర్లను సంప్రదించడం ముఖ్యం

టాపిక్

తదుపరి వ్యాసం