తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మ‌నుషుల‌కు తొలిసారి సోకిన బ‌ర్డ్ ఫ్లూ కొత్త వైరస్‌

మ‌నుషుల‌కు తొలిసారి సోకిన బ‌ర్డ్ ఫ్లూ కొత్త వైరస్‌

HT Telugu Desk HT Telugu

27 April 2022, 21:55 IST

  • చైనాలో బ‌ర్డ్ ఫ్లూ వ్యాధికి చెందిన కొత్త స్ట్రెయిన్ హెచ్3ఎన్8 తొలిసారి మ‌నుషుల‌కు సోకింది. హెన‌న్ రాష్ట్రంలో ఈ వేరియంట్‌ కార‌ణంగా బ‌ర్డ్ ఫ్లూ సోకిన నాలుగేళ్ల బాలుడు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌గ‌జేసే హెచ్3ఎన్8 వేరియంట్ సాధార‌ణంగా కోళ్లు, కుక్క‌లు, గుర్రాల్లో ఎక్కువగా క‌నిపిస్తుంటుంది. అలాగే, జ‌ల‌చ‌రం సీల్స్‌లోనూ క‌నిపిస్తూ ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వేరియంట్ మనుషుల‌కు సోక‌లేదు. తొలిసారి చైనాలోని హెనాన్ రాష్ట్రంలో నాలుగేళ్ల బాలుడు దీని బారిన ప‌డ్డాడు. జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న ఈ బాలుడిని ఆసుప‌త్రిలో చేర్చారు. ప్ర‌స్తుతం ఆ బాలుడి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ బాలుడి ఇంటివ‌ద్ద కోళ్లు, బాతులను పెంచుతుంటార‌ని, వాటి ద్వారానే ఇది అత‌డికి సోకి ఉండ‌వ‌చ్చ‌ని చైనా నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. ఈ హెచ్‌3ఎన్‌8 వేరియంట్ వైర‌స్ మ‌నుషుల‌పై చూపే ప్ర‌భావాన్ని ఇంకా ప‌రిశోధించాల్సి ఉంద‌ని బ్రిట‌న్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెంజా స్పెష‌లిస్ట్ నికొలా లూయిస్ తెలిపారు. 

ర‌ష్య‌న్ ఫ్లూతో ల‌క్ష‌లాది మ‌ర‌ణాలు

1889లో ఇదే త‌ర‌హా వైర‌స్ కార‌ణంగా వ‌చ్చిన ర‌ష్య‌న్ ఫ్లూ మ‌హ‌మ్మారిగా మారి ల‌క్ష‌లాదిగా ప్రాణాలు బ‌లి తీసుకున్న విష‌యాన్ని మ‌ర‌చిపోకూడ‌ద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. గ‌త సంవ‌త్స‌రం చైనాలో బ‌ర్డ్ ఫ్లూ క‌లుగ‌జేసే మ‌రో వేరియంట్ హెచ్‌10ఎన్‌3 తొలిసారి మ‌నుషుల‌కు సోకింది. 1997లో వెలుగులోకి వ‌చ్చిన హెచ్5ఎన్1, అలాగే 2013లో గుర్తించిన హెచ్‌7ఎన్9 వేరియంట్ల ద్వారా బ‌ర్డ్ ఫ్లూ మ‌నుషుల‌కు సోకింది. కానీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌కుండానే అవి క‌నుమ‌రుగ‌య్యాయి.

సంబంధిత కథనం

టాపిక్

తదుపరి వ్యాసం