తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత- రెండు వారాల్లో పని చేసింది 11గంటలే!

దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత- రెండు వారాల్లో పని చేసింది 11గంటలే!

Sharath Chitturi HT Telugu

31 July 2022, 17:18 IST

  • Parliament Monsoon session: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు మొదలై రెండు వారాలు గడిచిపోయింది. కానీ  పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో కార్యకలాపాలు సరిగ్గా జరగడం లేదు. ఇప్పటివరకు కేవలం 11గంటలు మాత్రమే పనిచేసింది. రాజ్యసభ ఉత్పాదకత కూడా భారీగా పడిపోయింది.

దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత
దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత (ANI)

దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత

Parliament Monsoon session: ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఉత్పాదకత దారుణంగా పతనమైంది. ముఖ్యంగా రెండోవారం.. ‘పెద్దల సభ’గా పేరొందిన రాజ్యసభ ఉత్పాదకత 16.49శాతంగా నమోదైంది. మొదటి వారంలో అది 26.90శాతంగా ఉంది. ధరల పెరుగుదల, జీఎస్​టీ, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై విపక్షాలు నిరసన చేస్తుండటంతో.. ఈ రెండు వారాల్లో రాజ్యసభ అనేకమార్లు వాయిదా పడింది. అంతేకాకుండా.. రెండు వారాల్లోనే 23మంది ఎంపీలు సస్పెన్షన్​కు గురయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

మొత్తం మీద.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఉత్పాదకత 21.58శాతంగా ఉంది. జులై 18న ప్రారంభమైన రాజ్యసభ.. ఇప్పటివరకు 10సార్లు సమావేశమైంది. కానీ రాజ్యసభ పనిచేసింది 11గంటల 8 నిమిషాలు మాత్రమే. షెడ్యూల్​ ప్రకారం.. ఈ రెండు వారాల్లో రాజ్యసభ 51 గంటల 35 నిమిషాలు పనిచేయాల్సి ఉంది. అంటే.. ఇప్పటికే 40గంటల 45 నిమిషాల సమయం వృథా అయిపోయింది.

Rajya Sabha productivity : అంతేకాకుండా.. ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో.. రాజ్యసభలో ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా పాస్​ అవ్వలేదు. జీరో హవర్​(శున్య గంట) కూడా జరగలేదు. రెండు వారాల్లో.. క్వశ్చన్​ హవర్​ కూడా ఆరు రోజులు జరగలేదు.

విపక్షాల నిరసనలపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్​ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. సభ వెల్​లోకి ఎంపీలు దూసుకొస్తుండటాన్ని తప్పుబట్టారు.

అటు లోక్​సభలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి విపక్షాలు. ఫలితంగా స్పీకర్​.. సభను వాయిదా వేయకతప్పడం లేదు.

టాపిక్