‘అప్పుల’ జాబితాలో తమిళనాడు టాప్​.. ఏపీ- తెలంగాణ పరిస్థితి ఇది!-tamil nadu has highest debts burden ap and telangana stands in these positions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘అప్పుల’ జాబితాలో తమిళనాడు టాప్​.. ఏపీ- తెలంగాణ పరిస్థితి ఇది!

‘అప్పుల’ జాబితాలో తమిళనాడు టాప్​.. ఏపీ- తెలంగాణ పరిస్థితి ఇది!

Sharath Chitturi HT Telugu
Jul 25, 2022 06:57 PM IST

వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించాలని లోక్​సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ సమాధానం ఇచ్చారు. ఆ జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.

‘అప్పుల’ జాబితాలో తమిళనాడు టాప్​.. ఏపీ- తెలంగాణ పరిస్థితి ఇది!
‘అప్పుల’ జాబితాలో తమిళనాడు టాప్​.. ఏపీ- తెలంగాణ పరిస్థితి ఇది! (HT Telugu)

దేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్రానికి రూ. 6,59,868లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో వెల్లడించారు.

ప్రస్తుతం.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కాగా.. వివిధ రాష్ట్రాల అప్పులపై వివరణ ఇవ్వాలని ఎంపీ కిషోర్​ కపూర్​ లోక్​సభలో ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నకు.. ఈ మేరకు నిర్మలా సీతారామన్​ సమాధానం ఇచ్చారు.

ఇక అప్పుల జాబితాలో ఆంధ్రప్రదేశ్​ 8వ స్థానం, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. ఏపీకి రూ. 3,98,903లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. తెలంగాణకు రూ. 3,12,191లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి.

ఈ లెక్కన చూసుకుంటే.. అప్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉన్నట్టే!

రాష్ట్రాలుఅప్పులు (2022 మార్చ్​ నాటికి)
తమిళనాడురూ. 6,59,868 లక్షలకోట్లు 
ఉత్తర్​ప్రదేశ్​రూ. 6,53,307లక్షల కోట్లు
మహారాష్ట్రరూ. 6,08,999లక్షల కోట్లు
పశ్చిమ్​ బెంగాల్​రూ. 5,62,697లక్షల కోట్లు
రాజస్థాన్​రూ. 4,77,177లక్షల కోట్లు
కర్ణాటకరూ. 4,62,832లక్షల కోట్లు
గుజరాత్​రూ. 4,02,785లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్​రూ. 3,98,903లక్షల కోట్లు
కేరళరూ. 3,35,989లక్షల కోట్లు
మధ్యప్రదేశ్​రూ. 3,17,736లక్షల కోట్లు
తెలంగాణరూ. 3,12,191లక్షల కోట్లు

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్