Rashtrapatni row : రాష్ట్రపతిని గౌరవించలేదని స్మృతి ఇరానీపై అధీర్​ ఫిర్యాదు-amid rashtrapatni row adhir ranjan writes to om birla says smriti irani yelled president s name without prefixing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Amid Rashtrapatni Row, Adhir Ranjan Writes To Om Birla, Says Smriti Irani Yelled President's Name Without Prefixing

Rashtrapatni row : రాష్ట్రపతిని గౌరవించలేదని స్మృతి ఇరానీపై అధీర్​ ఫిర్యాదు

Sharath Chitturi HT Telugu
Jul 30, 2022 08:42 AM IST

Rashtrapatni row : బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై లోక్​సభ స్పీకర్​కు కాంగ్రెస్​ ఎంపీ అధీర్​ రంజన్​ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతికి ఆమె గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు.

రాష్ట్రపతిని గౌరవించలేదని స్మృతి ఇరానీపై అధీర్​ ఫిర్యాదు
రాష్ట్రపతిని గౌరవించలేదని స్మృతి ఇరానీపై అధీర్​ ఫిర్యాదు (PTI)

Rashtrapatni row : పార్లమెంట్​లో ‘రాష్ట్రపతి’ చుట్టూ అలుముకున్న వివాదం ఇప్పట్లో ముగిసేడట్టు కనిపించడం లేదు. ఇన్నిరోజులు.. కాంగ్రెస్​ ఎంపీ అధీర్​ రంజన్​పై అధికారపక్షం మండిపడితే.. ఇప్పుడు అందుకు ఆయన రివేంజ్​ తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ మహిళా ఎంపీ స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు అధీర్​ రంజన్​ చౌధరి. రాష్ట్రపతికి ఆమె గౌరవం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"శ్రీమతి స్మృతి ఇరానీ.. రాష్ట్రపతి గురించి సభలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఆమె రాష్ట్రపతికి గౌరవం ఇవ్వలేదు. మేడం/శ్రీ అని సంబోధించకుండానే అనేకమార్లు రాష్ట్రపతి పేరును ప్రస్తావించారు. 'ద్రౌపది ముర్ము.. ద్రౌపది ముర్ము' అని ఆమె అనేకమార్లు అరిచారు. ఇది రాష్ట్రపతిని, రాష్ట్రపతి కార్యాలయాన్ని కించపరిచినట్టే. ఆమె ప్రసంగాన్ని సభ కార్యకలాపాల నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తున్నా," అని తన ఫిర్యాదులో అధీర్​ రంజన్​ వివరించారు.

ఈ వ్యవహారంలో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి సంబంధం లేదని, అందువల్ల ఆమె చుట్టు జరిగిన పరిణామాలను కూడా సభ కార్యకలాపాల నుంచి తొలగించాలని ఓం బిర్లాకు అధీర్​ రంజన్​ విజ్ఞప్తి చేశారు.

ఇదీ వివాదం..

Adhir Ranjan : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని సంబోధించారు అధీర్​ రంజన్​ చౌదరి. తప్పుగా ఆ పదం దొర్లిందని, అవసరమైతే.. ద్రౌపదికి తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది! బీజేపీకి.. ఆయన మరో అవకాశం ఇచ్చేశారు.

ఈ పరిణామాలతో లోక్​సభ అట్టుడికింది. అధీర్​ రంజన్​తో పాటు సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్​ చేశారు. గురువారం.. సోనియా గాంధీ సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధీర్​ రంజన్​ చౌదరి మాటలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు పట్టుబట్టారు. 'నేను ఎందుకు సారీ చెప్పాలి?' అని సోనియా అడిగితే.. 'అధీర్​ రంజన్​ను కాంగ్రెస్​ సభా పక్షనేతగా ఎన్నుకోవడమే మీరు చేసిన తప్పు. అందుకే క్షమాపణలు చెప్పాలి,' అని బీజేపీ మహిళా ఎంపీలు తేల్చిచెప్పారు.

చివరికి.. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్టు.. రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం