Monsoon Session : సోమవారం నుంచే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు.. బీజేపీ వర్సెస్​ విపక్షాలు!-parliament monsoon session to begin from 18th july ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Parliament Monsoon Session To Begin From 18th July

Monsoon Session : సోమవారం నుంచే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు.. బీజేపీ వర్సెస్​ విపక్షాలు!

Sharath Chitturi HT Telugu
Jul 17, 2022 03:36 PM IST

Parliament Monsoon Session : సోమవారం నుంచి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆగస్ట్​ 12 వరకు ఉభయ సభల కార్యకలాపాలు సాగుతాయి. కాగా.. ఈ దఫా సమావేశాల్లో.. రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి.

సోమవారం నుంచే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు..
సోమవారం నుంచే పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు..

Parliament Monsoon Session : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఆగస్ట్​ 12 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దేశ సమస్యలపై బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బీజేపీ ముమ్మర కసరత్తులు చేసింది.

రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికలు..

ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు అత్యంత కీలకంగా ఉండనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుల పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆయా పదవుల్లో.. ఇవే వారికి చివరి పార్లమెంట్​ సమావేశాలు.

కాగా.. సోమవారం పార్లమెంట్​ సమావేశాలు మొదలైన వెంటనే.. రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎంపీలు.. పార్లమెంట్​లోని పోలింగ్​ బూత్​లలో ఓట్లు వేయనున్నారు. ఈ నెల 21 కౌంటింగ్​తో పాటు ఫలితాలు వెలువడనున్నాయి. విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాతో పోల్చుకుంటే.. ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే మద్దతు ఎక్కువగా ఉండటంతో.. ఆమె ఎన్నిక లాంఛనమే!

మరోవైపు ఆగస్ట్​ 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ కూడా.. ఎన్​డీఏ అభ్యర్థి జగ్​దీప్​ ధన్​ఖడ్​ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Parliament session 2022 : ఈ ప్రక్రియలు కొనసాగుతుండగా.. ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మొత్తం మీద 24 కొత్త బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. వీటితో పాటు ఇప్పటికే 8 బిల్లులు పార్లమెంట్​లో పెండింగ్​లో ఉన్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టనున్న 24బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అంతేకాకుండా.. పార్లమెంట్​లో పాటించాల్సిన కొత్త రూల్స్​ను కూడా ప్రకటించింది కేంద్రం. పార్లమెంట్​ ఆవరణలో నిరసనలను నిషేధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బీజేపీ వర్సెస్​ విపక్షాలు..

ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో దేశంలోని అనేక సమస్యలను ప్రస్తావించి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు విపక్షాలు సిద్ధపడుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపత్​ పథకం, నిరుద్యోగం, రూపాయి పతనం వంటి అంశాలు ఉభయ సభలను కుదిపేసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా మతపరమైన ఘర్షణలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంపై ప్రధాని మోదీని నుంచి సమాధానం అడగాలని విపక్షాలు భావిస్తున్నాయి.

Parliament news today : పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాలు ఇప్పటికే సమావేశాలు జరిపాయి. కాంగ్రెస్​ ఎంపీలు సైతం గురువారం భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.

విపక్షాల బాణాలను అడ్డుకునేందుకు బీజేపీ సైతం సన్నద్ధమైంది. ఈ మేరకు ఎంపీలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి.. పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

అఖిలపక్ష సమావేశం..

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీతో పాటు వివిధ పార్టీల ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనకపోవడంతో విపక్షాలు తమ అసహనాన్ని వ్యక్తం చేశాయి.

All party meeting today : కాగా.. శ్రీలంక సంక్షోభంపై ఈ మంగళవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్​, ఎస్​ జైశంకర్​లు.. శ్రీలంక సంక్షోభంపై ప్రకటన చేస్తారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం.. పార్లమెంట్​ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం