తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jnu Pg Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

04 May 2024, 7:20 IST

  • JNU PG admission 2024 application form : జేఎన్​యూ తన అధికారిక వెబ్​సైట్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎలా రిజిస్ట్ర్​ చేసుకోవాలి? అర్హత వివరాలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ఓపెన్​..
జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ఓపెన్​..

జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ఓపెన్​..

JNU PG Admissions 2024 registration : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్​యూ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల రిజిస్ట్రేషన్లు 2024 మే 1న ప్రారంభమయ్యాయి. ఔత్సాహిక అభ్యర్థులు మే 27, 2024 లోగా.. jnuee.jnu.ac.in అధికారిక వెబ్​సైట్​ని సందర్శించి తమకు నచ్చిన కోర్సు కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎమ్మెస్సీ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులను.. వారి సీయూఈటీ పీజీ మార్కుల ఆధారంగా షార్ట్​లిస్ట్​ చేస్తారు.

జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ని ఇలా చేసుకోండి..

  1. స్టెప్​ 1:- jnuee.jnu.ac.in లోని జేఎన్​యూ అధికారిక వెబ్​సైట్​కు వెళ్లండి.

2. స్టెప్​ 2:- అడిగిన వివరాలను ఎంటర్ చేసి ఇచ్చిన స్పేస్​లో రిజిస్టర్ చేసుకోండి.

JNU PG Registration : 3. స్టెప్​ 3:- అప్లికేషన్ ఫామ్ నింపండి.

4. స్టెప్​ 4:- మీ ఫోటో, సంతకం స్కాన్ చేసిన కాపీలను నిర్ణీత పరిమాణంలో అప్లోడ్ చేయండి.

5. స్టెప్​ 5:- అప్లికేషన్ ఫీజును చెల్లించండి.

6. స్టెప్​ 5:- తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్​ని డౌన్​లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

ఇదీ చూడండి:- CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

అర్హత ప్రమాణాలు:

జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ 2024 అర్హత వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

JNU PG admission : 1. ఎంఏ: ఎంఏ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. యూజీసీ లేదా యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10+2+3 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీయూఈటీ పీజీ స్కోర్ ఉండాలి.

2. ఎమ్మెస్సీ: ఎమ్మెస్సీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి సీయూఈటీ పీజీ స్కోర్​తో పాటు ఏదైనా స్పెషలైజేషన్​లో 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

JNU PG 2024 : 3. ఎంసీఏ కోర్సుకు కనీసం 55 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్​లో బీసీఏ/ బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో 10+2 స్థాయిలో మ్యాథ్స్ లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ/ బీకాం/ బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు..

CSIR UGC NET : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్​టీఏ.. 2024 మే 1న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్​సైట్​ csirnet.nta.ac.in వద్ద డైరెక్ట్ లింక్​ను చూడవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం