CSIR UGC NET June 2024 application form : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ.. 2024 మే 1న సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ csirnet.nta.ac.in వద్ద డైరెక్ట్ లింక్‌ను చూడవచ్చు.
ఆన్లైన్ ద్వారా పరీక్షకు దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 మే 2024. పేమెంట్ విండో మే 22 నుంచి మే 23, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. కరెక్షన్ విండో మే 25న ప్రారంభమై 2024 మే 27న ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.
2024 జూన్ 25, 26, 27 తేదీల్లో సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ టెస్టులో మూడు భాగాలు ఉంటాయి. అన్ని విభాగాల్లో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్స్ మధ్య విరామం ఉండదు.
యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CSIR UGC NET June 2024 exam date : అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని పాటించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
CSIR UGC NET June 2024 apply online : దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరికి రూ.1150, జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(ఎన్సీఎల్)కు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్‌కి రూ.325. నెట్ బ్యాంకింగ్/డెబిట్/క్రెడిట్ కార్డ్/యూపీఐ ద్వారా పేమెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CSIR UGC NET June 2024 notification : యూజీసీ నెట్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో చెప్పిన డేట్ నుంచి రెండు రోజులకు వాయిదా పడ్డాయి. ఫలితంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ.. జూన్ 16న నిర్వహించాల్సిన యూజీసీ నెట్ 2024.. జూన్ 18కి వాయిదా పడింది. ఈ విషయాన్ని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం