UGC NET 2024 : యూజీసీ నెట్ 2024 పరీక్ష వాయిదా- కొత్త డేట్ ఇదే..
UGC NET 2024 exam date : యూజీసీ నెట్ 2024 పరీక్ష వాయిదా పడింది. కొత్త డేట్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
UGC NET 2024 postponed : యూజీసీ నెట్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో చెప్పిన డేట్ నుంచి రెండు రోజులకు వాయిదా పడ్డాయి. ఫలితంగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ.. జూన్ 16న నిర్వహించాల్సిన యూజీసీ నెట్ 2024.. జూన్ 18కి వాయిదా పడింది. ఈ విషయాన్ని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు.
“అభ్యర్థుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది,” అని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో యూజీసీ ఛైర్మన్ పోస్ట్ చేశారు.
UGC NET 2024 exam date : "అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కారణంగా యూజీసీ నెట్ ను జూన్ 16 (ఆదివారం) నుంచి 18 జూన్ 2024 (మంగళవారం)కు మార్చాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూజీసీ నిర్ణయించాయి. ఎన్టీఏ యూజీసీ-నెట్‌ని భారతదేశం అంతటా ఒకే రోజు ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తుంది. త్వరలోనే ఎన్టీఏ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది," అని యూజీసీ ఛైర్మన్ చెప్పుకొచ్చారు.
యూజీసీ-నెట్ పరీక్షను ఓఎంఆర్ ఆధారిత విధానంలో మాత్రమే నిర్వహిస్తారు. లాంగ్వేజ్ పేపర్లు మినహా ప్రశ్నపత్రం మాధ్యమం ఇంగ్లిష్, హిందీలో ఉంటుందని.
UGC NET 2024 application form : ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండింటిలోనూ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్ల మధ్య విరామం ఉండదు. ప్రతి పేపర్ పరీక్ష వ్యవధి 3 గంటలు.
ఇదీ చూడండి:- UGC news: నెట్ స్కోర్ తో పీహెచ్ డీ అడ్మిషన్లకు యూజీసీ అనుమతి
యూజీ డిగ్రీ తర్వాత పీహెచ్డీ..!
నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన విద్యార్థులు.. ఇకపై నేరుగా నెట్‌కు హాజరై పీహెచ్డీ చేయవచ్చు! ఈ విషయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ ఇటీవలే వెల్లడించారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఉన్నా, లేకపోయినా పీహెచ్డీ చేయాలంటే.. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో కనీసం 75 శాతం మార్కులు లేదా అందుకు సమానమైన గ్రేడ్లు ఉండాలని జగదీశ్ స్పష్టం చేశారు.
UGC NET 2024 : ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్)కు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
యూజీసీ నిర్ణయం మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కులు లేదా అందుకు సమాన గ్రేడ్ సడలింపు ఇవ్వొచ్చని తెలిపారు. పూర్తి వివారల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం