తెలుగు న్యూస్  /  National International  /  Maha: Man Rapes, Impregnates 13-year-old Girl In Thane, Booked

Crime | 30ఏళ్ల వ్యక్తి అత్యాచారంతో.. 13ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక

HT Telugu Desk HT Telugu

29 April 2022, 13:50 IST

  • మహారాష్ట్ర: మూడేళ్ల క్రితం ఆ ఇంట్లో పనిలోకి చేరాడు ఓ వ్యక్తి. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఆ కుటుంబంలోని బాలికపై అనేకమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఫలితంగా 13ఏళ్లకే ఆ బాలిక గర్భం దాల్చింది.

అత్యాచారంతో గర్భం దాల్చిన 13ఏళ్ల బాలిక
అత్యాచారంతో గర్భం దాల్చిన 13ఏళ్ల బాలిక (Hindustan times telugu)

అత్యాచారంతో గర్భం దాల్చిన 13ఏళ్ల బాలిక

Maharastra crime news | మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాధితురాలు గర్భం దాల్చింది.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

ఎవరు లేని సమయంలో..

మహారాష్ట్ర ఠాణెలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. గోద్​బుందర్​ రోడ్డులోని ఓ కుటుంబం.. మూడేళ్ల క్రితం ఓ వ్యక్తిని పనిలో పెట్టుకుంది. పనిలో చేరిన ఆ 30ఏళ్ల వ్యక్తికి.. కుటుంబంలోని బాలికపై కన్నుపడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడల్లా.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటం మొదలుపెట్టాడు. ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. ఫలితంగా బాలిక ఎవరికి చెప్పాలేదు.

కాగా.. ఇటీవలే బాలికకు కడుపులో నొప్పి ఎక్కువైంది. ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. కొన్ని రోజులకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆ 13ఏళ్ల బాలిక గర్భం దాల్చినట్టు తల్లిదండ్రులకు తెలిసింది. జరిగిన విషయాన్ని, బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది.

ఘటనను తీవ్రంగా పరిగణించిన తల్లిదండ్రులు.. నిందితుడు గురించి కసర్​వాడావాలీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇంకా నిందితుడును అరెస్ట్​ చేయలేదని సమాచారం.

టాపిక్