తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime | 11ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. అందరు మైనర్లే..!

Crime | 11ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. అందరు మైనర్లే..!

HT Telugu Desk HT Telugu

24 April 2022, 12:25 IST

  • ఝార్ఖండ్​: ఓ 11ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆరుగురు నిందుతులు.. మైనర్లే కావడం గమనార్హం.

బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్​ రేప్​..!
బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్​ రేప్​..! (Hindustan times telugu)

బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్​ రేప్​..!

Jharkhand gang rape | ఝార్ఖండ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 11ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది.

ఆరుగురు మైనర్లు…

కుంటి జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిందితులు అందరు మైనర్లేనని తెలుస్తోంది. వారిని పోలీసులు పట్టుకున్నారు.

"11ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. ఈ నేరానికి పాల్పడిన ఆరుగురిని పట్టుకున్నాము. 10-16ఏళ్ల మధ్య వయస్సులో ఉంటారు. వారిని జుడీషియల్​ మెజిస్ట్రేట్​ వద్ద హాజరుపరుస్తాము," అని కుంటి ఎస్​పీ అమన్​ కుమార్​ వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఎస్​పీ స్పష్టం చేశారు.

అసలేం జరిగింది..?

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఓ వివాహ వేడుక కోసం బాలిక.. పొరుగున ఉన్న గ్రామానికి వెళ్లింది. తనకు పరిచయం ఉన్న ఆరుగురు అబ్బాయిలు కూడా అక్కడికి వెళ్లారు. డ్యాన్స్​ ప్రొగ్రాం మధ్యలో బాలికకు, అబ్బాయిలకు మధ్య గొడవ మొదలైంది.

Jharkhand crime new | ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు.. బాలిక తన ఇతర స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఇంటికి బయలుదేరింది. ఆ ఆరుగురు.. బాలికను వెంబడించారు. ఆమెను అడ్డుకుని.. ఎవరూలేని ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక స్నేహితులు.. బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. జరిగిన విషయాన్ని వివరించారు. అందరు కలిసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

బాలికకు జరిగిన అన్యాయం పట్ల కుటుంబసభ్యలు బాధపడ్డారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేశారు. సమాజం ఏం అనుకుంటుందోనని భయపడ్డారు. చివరికి ధైర్యం చేసి గురువారం.. పోలీసుల వద్దకు వెళ్లారు. జరిగింది అంతా వివరించారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం