తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duggirala Crime | దుగ్గిరాల అత్యాచార ఘటన.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

Duggirala Crime | దుగ్గిరాల అత్యాచార ఘటన.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

HT Telugu Desk HT Telugu

28 April 2022, 21:16 IST

    • దుగ్గిరాల అత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోందన్న సమయంలో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. అసలు మహిళపై అత్యాచారమే జరగలేదని తేల్చిచెప్పారు. దీంతో.. ఉదయం నుంచి.. జరిగిన ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ఘటనపై ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ ఘటనపై.. పోలీసులు భారీ ట్వీస్ట్ ఇచ్చారు. అసలు అత్యాచారమే.. జరగలేదని.. పోలీసులు చెప్పేశారు. వివాహేతర.. సంబంధమే అసలు కారణమని చెప్పారు. శాస్త్రీయ.. ఆధారాల ఆధారంగా.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు.. ఇద్దరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

ఏమైందంటే..?

దుగ్గిరాలకు చెందిన.. తిరుపతమ్మ.. ఇంట్లో అచేతనంగా పడి ఉంది. అదే సమయానికి బంధువైన.. ఓ యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు. తిరుపతమ్మ ఒంటిపై దుస్తులు సరిగా లేవు. ఆమె చెవి రింంగులు, కూడా పక్కనే పడి ఉన్నాయి. మరోవైపు ఆమె గొంతు నులిమినట్టుగా గుర్తులు కనిపిస్తున్నాయి. ఏమైందోననే గాబరాతోనే.. 108 సిబ్బందికి.. వెంటనే సమచారమిచ్చాడు యువకుడు.

తిరుపతమ్మకు పదిహేనేళ్ల కిందటే.. శ్రీనివాసరావు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి.. కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ బతుకుతున్నారు. అయితే.. శ్రీనివాసరావు.. పనుల కోసం.. గ్రామం విడిచి వెళుతుంటాడు. అయితే గత డిసెంబరులో.. పనులు కోసం.. ఇంటి నుంచి వెళ్లాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్తకు వెంటనే సమాచారమిచ్చారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు చెప్పాడు.. వెంటనే ఇంటికి బయల్దేరి వస్తున్నట్టుగా చెప్పారు.

అయితే ఈ కేసును పోలీసులు.. ఛేదించారు. అసలు ఈ ఘటనలో అత్యాచారమే జరగలేదని చెప్పారు. బాధిత మహిళకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. అదే హత్యకు దారితీసిందని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్ వెల్లడించారు. మహిళను హత్య చేసిన నిందితుడు శివసత్య సాయిరాంతో పాటు ఆమెతో అక్రమ సంబంధం ఉన్న వెంకట సాయి సతీష్‌ను అరెస్టు చేశారు.

మృతురాలి ఇంటికి వెంకట సాయి సతీష్‌, అతని స్నేహితుడు శివసత్య సాయిరాం వెళ్లారు. శివసత్యసాయిరాం.. తన కోరిక తీర్చాలని.. తిరుపతమ్మను బలవంతం చేశాడు. అయితే ఆమె దీనికి నిరాకరించింది. తన దగ్గరకు వస్తే.. ఈ విషయం ఊళ్లో అందరికీ చెప్తానని బెదిరించింది. దీంతో.. శివసత్యసాయిరాం.. భయపడ్డాడు. కోపంతో.. ఆమెను చంపేయాలనుకున్నాడు. ఆమె చీరనే మెడకు బిగించి చంపేశాడని.. ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని వెల్లడించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ ప్రశంసించారు.

లోకేశ్ పర్యటన ఉద్రిక్తత

తుమ్మపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.., టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లోకేశ్ పైకి పలువురు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ఎంటర్ అయి.. పరిస్థితులను సద్దుమణిగేలా చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం