తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం..

మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం..

HT Telugu Desk HT Telugu

21 April 2022, 12:02 IST

    • మతిస్థిమితం లేని యువతి మూడ్రోజుల క్రితం అదృశ్యమైంది. చుట్టు పక్కల గాలించిన తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. రైల్వే ట్రాకుల వెంట వెదుక్కోమని ఉచిత సలహా ఇచ్చి ఊరుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

మూడ్రోజులుగా బాలిక ఆచూకీ కోసం ఆమె తల్లి వెదకని ప్రదేశం లేదు. చివరకు యువతి పుస్తకాల్లో ఓ ఫోన్ నంబర్‌ గుర్తించి పోలీసులకు తెలపడంతో దారుణం బయటపడింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిని బంధించి మూడ్రోజులుగా అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. బాధితురాలిని కాపాడి నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే ఉద్యోగిగా గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

విజయవాడ నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ యువతి మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. సింగ్‌నగర్‌ వాంబే కాలనీలో నివసించే యువతికి మానసిక ఎదుగుదల లేకపోవడంతో ఆమెను మానసిక వికాస కేంద్రంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఇంటి నుంచి మాయమైన యువతి కోసం ఆమె తల్లితో పాటు, బంధువులు, చుట్టుపక్కల వారు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో అదే రోజు నున్న పోలీసుల్ని ఆశ్రయించారు. వాంబే కాలనీ, రైల్వే ట్రాక్‌ల వెంబడి గాలించాలని పోలీసులు వారికి సూచించారు. ఆ తర్వాత బాలిక పుస్తకాలను పరిశీలించడంతో అందులో ఓ ఫోన్ నంబర్ రాసి ఉండటం గమనించారు. ఆ సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో యువతిని ప్రభుత్వాస్పత్రిలో బంధించిన విషయాన్ని బయటపెట్టాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న యువతి అచూకీ కనిపెట్టారు. బాధితురాలిపై ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే ఉద్యోగితో పాటు మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు గుర్తించారు. బాధితురాలి ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తి ఆమెతో పరిచయం చేసుకుని దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని బాధితులు ఆరోపిస్తున్నారు.

యువతి అదృశ్యమైన రోజే పోలీసులు స్పందించి ఉంటే ఆమె అచూకీ లభ్యమై ఉండేదని బాధితురాలి తల్లి వాపోతున్నారు. బాధితురాలికి సరిగా మాట్లాడటం కూడా రాదని, 23ఏళ్ల వయసొచ్చినా మానసిక ఎదుగుదల లేకపోవడంతో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. వాంబే కాలనీ హెచ్‌ బ్లాక్‌ నుంచి యువతిని అపహరించిన నిందితులు 19వ తేదీ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి బంధించారు. నిందితుడు బాధితురాలితో పరిచయం పెంచుకుని ఇంటి నుంచి తీసుకుపోయాడని బాధితురాలి తల్లి కన్నీరుమున్నీరైంది. మరోవైపు మతిస్థిమితం లేని యువతిపై జరిగిన దాష్టీకాన్ని నిరసిస్తూ టీడీపీ, సీపీఎం నేతలు పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. బాధితుల్ని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం