తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Irctc Ladakh Tour Package : హైదరాబాద్​ టు లద్దాఖ్​.. ది బెస్ట్​ ప్యాకేజీ..!

IRCTC Ladakh tour package : హైదరాబాద్​ టు లద్దాఖ్​.. ది బెస్ట్​ ప్యాకేజీ..!

Sharath Chitturi HT Telugu

28 August 2022, 13:25 IST

    • IRCTC Ladakh tour package : లద్దాఖ్​కు కొత్త ప్యాకేజీలు తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ. ఆ ప్యాకేజీల వివరాలు..
మీ ట్రావెల్​ లిస్ట్​లో లద్దాఖ్​ ఉందా? అయితే ఈ ఐఆర్​సీటీసీ ప్యాకేజీలు మీకోసమే..!
మీ ట్రావెల్​ లిస్ట్​లో లద్దాఖ్​ ఉందా? అయితే ఈ ఐఆర్​సీటీసీ ప్యాకేజీలు మీకోసమే..!

మీ ట్రావెల్​ లిస్ట్​లో లద్దాఖ్​ ఉందా? అయితే ఈ ఐఆర్​సీటీసీ ప్యాకేజీలు మీకోసమే..!

IRCTC Ladakh tour package : 'లద్దాఖ్​ రోడ్​ ట్రిప్​'.. ఇది ఎంతో మంది కల! జీవితంలో ఒక్కసారైనా లద్దాఖ్​కు వెళ్లి.. అక్కడ బైక్​ మీద చక్కర్లు కొట్టాలని చాలా మందికి డ్రీమ్స్​ ఉంటాయి. వారిలో మీరూ ఒకరా? లద్దాఖ్​ ట్రిప్​నకు వెళ్లాలని ఉన్నా.. ఖర్చులు చూసి భయపడుతున్నారా? అయితే.. మీకోసమే ఐఆర్​సీటీసీ టూరిజం ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఆ వివరాలు..

ట్రెండింగ్ వార్తలు

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

1. హైదరాబాద్​ టు లేహ్- లద్దాఖ్​​..

ఐఆర్​సీటీసీ టూరిజం ప్యాకేజీలో భాగంగా.. హైదరాబాద్​ టు లద్దాఖ్​, లేహ్​ ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఈ ప్యాకేజీలో 6 రాత్రులు/ 7 రోజులు ఉంటాయి. శామ్​ వాలీ, లేహ్​, నుబ్రా, టుర్టుక్​, పాంగ్యాంగ్​ ప్రాంతాలు ఈ ట్రిప్​లో కవర్​ చేయవచ్చు. ఆగస్టు 25న ఒక ట్రిప్​ ముగిసింది. సెప్టెంబర్​ 8, 23న మరో రెండో ట్రిప్​లు ప్రారంభంకానున్నాయి. ఈ ఐఆర్​సీటీసీ టూరిజం ప్యాకేజీ ధర రూ. 41,360.

<p>హైదరాబాద్​ టు లద్దాఖ్​</p>

2. ఢిల్లీ టు లద్దాఖ్​..

ఈ ఐఆర్​సీటీసీ లద్దాఖ్​ టూరిజం ప్యాకేజీలో 6 రాత్రులు/ 7 రోజులు ఉంటాయి. ఢిల్లీ నుంచి ఈ ట్రిప్​ మొదలవుతుంది. సెప్టెంబర్​ 3, 5, 10, 12, 17, 19, 29 తేదీల్లో ట్రిప్​లు ఉంటాయి. ఈ ట్రిప్​ ప్యాకేజీ ధర రూ. 32,960. 3 స్టార్​ హోటల్స్​, ఫుడ్​ వంటివి ప్యాకేజీ ధరలోనే కలిసి ఉంటాయి.

IRCTC Ladakh tour package details : లేహ్​, శామ్​ వాలీ, నుబ్రా, పాంగ్యాంగ్​, టుర్టుక్​ ప్రాంతాలు కవర్​ చేయవచ్చు.

<p>ఢిల్లీ టు లద్దాఖ్​</p>

3. కోల్​కతా టు లేహ్​- లద్దాఖ్​..

ఈ ఐఆర్​సీటీసీ టూరిజం ప్యాకేజీ.. కోల్​కతా నుంచి మొదలవుతుంది. ముందుగా.. కోల్​కతా నుంచి ఢిల్లీకి విమానంలో వెళతారు. ఈ ప్యాకేజీ ధర రూ. 41,500. సెప్టెంబర్​ 11, 17, 23 తేదీల్లో ట్రిప్​ ప్రారంభమవుతుంది. లేహ్​, నుబ్రా, టుర్టుక్​, పాంగ్యాంగ్​ ప్రాంతాలను సందర్శించవచ్చు.

4. లక్నో టు లద్దాఖ్​..

IRCTC tour packages : ఈ ఐఆర్​సీటీసీ టూరిజం ప్యాకేజీ సెప్టెంబర్​ 7, 14, 21, 28న ఉంటుంది. 7రాత్రులు/8 రోజుల ట్రిప్​ ఇంది. లక్నో నుంచి మొదలవుతుంది. లాడ్జింగ్​, రోజుకు మూడు పుటలా భోజనం, బస్సు- విమాన ఛార్జీలు, సైట్​సీయింగ్​ ఖర్చులు ఈ ధరలో భాగం. శామ్​ వాలీ, లేహ్​, నుబ్రా, టుర్టుక్​, పాంగ్యాంగ్​ ప్రాంతాలను కవర్​ చేయవచ్చు. ఈ ప్యాకేజీ ధర రూ. 43,900.

పూర్తి వివరాల కోసం.. www.irctctourism.com వెబ్​సైట్​ను చూడండి.

ఐఆర్​సీటీసీ షిరిడీ టూర్​ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ టు ఉజ్జెయిన్​ టూర్​ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.