IRCTC cancels trains : ఒకేసారి 145 రైళ్లను రద్దు చేసిన ఐఆర్సీటీసీ
09 August 2022, 10:28 IST
- IRCTC cancels trains : ఈ వారంలో.. అనేక రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. వీటిల్లో.. ఒక్క మంగళవారమే 145 రైళ్లు రద్దయ్యాయి.
ఒకేసారి 145 రైళ్లను రద్దు చేసిన ఐఆర్సీటీసీ
IRCTC cancels trains : మంగళవారం ఏకంగా 145 రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వే. మరో 21 రైళ్ల ప్రారంభ స్టేషన్లను మార్చింది. ఇవే కాకుండా.. మరో 15 రైళ్లను ఐఆర్సీటీసీ పాక్షికంగా రద్దు చేసింది.
రైళ్ల నిర్వహణ, ఆపరేషన్ సమస్యల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. అందువల్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
enquiry.indianrail.gov.in లో సంబంధిత వివరాలు తెలుసుకోవచ్చు. ఒక్కోసారి రైళ్ల నెంబర్లు కూడా మారతాయని చెప్పిన ఐఆర్సీటీసీ.. సమాచారం కోసం వెబ్సైట్ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
మంగళవారంతో పాటు.. బుధవారం కూడా 131 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. 12వ తేదీకి సంబంధించి.. పలు రైళ్ల ప్రారంభ స్టేషన్లను మార్చింది.
ఇక ఆగస్టు 15న కూడా పలు రైళ్లను రద్దు చేసింది ఐఆర్సీటీసీ.
రద్దైన రైళ్లు.. మొత్తం ఉత్తర భారతానికి చెందినవే ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం ప్రయాణికులు enquiry.indianrail.gov.in వెబ్సైట్ను చూడాల్సి ఉంటుంది.