IRCTC Tourism: విజయవాడ టు షిర్డీ - టూర్ ప్యాకేజీ వివరాలివే
30 July 2022, 14:18 IST
- IRCTC Shirdi Tour: విజయవాడ నుంచి షిరిడీకి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
విజయవాడ - షిర్డీ టూర్
IRCTC Shirdi Sai Darshan: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు రైల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి సన్నిధి పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. రైలు మార్గంలో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. మొదటి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరల వివరాలు....
స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4850 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,280, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,930, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5420 చెల్లించాలి. కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,080, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7310 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.14,740, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7880 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్‌కి స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ క్లాస్‌కి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
NOTE
ప్రతి మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ప్రయాణికులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.