IRCTC Tourism: హైదరాబాద్ టు థాయ్ లాండ్... టూర్ ప్యాకేజీ వివరాలివే
hyderabad - thailand tour package:హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.ఇందులో పలు టూరిజం స్పాట్ లను చూపించనుంది.
irctc tourism hyd to thailand tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా కవర్ కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....
వచ్చే నెలలో ప్రారంభం....
వచ్చే నెల ఆగస్ట్ 12న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.12వ తేదీన అర్థరాత్రి 1.10 గంటలకు హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే తెల్లవారుజామున 6.15 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు రిలాక్స్ కావొచ్చు. లంచ్ తర్వాత పట్టాయలోని జెమ్స్ గ్యాలరీ సందర్శన ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో వీక్షించవచ్చు. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ ఉంటుంది. రాత్రికి పట్టాయాలో బస చేయాల్సి ఉంటుంది.
ఇక 2వ రోజు ఉదయం కోరల్ ఐల్యాండ్ పర్యటన బయల్దేరాలి. నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రికి ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత పట్టాయాలో బస చేయాలి. 3వ రోజు బ్యాంకాక్ సిటీకి బయల్దేరాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత గోల్డెన్ బుద్ధ ఆలయం, ఇతర ప్రాంతాలను చూడవచ్చు. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాలి. నాలుగో రోజు హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత సఫారీ వాల్డ్ టూర్, మెరైన్ పార్క్ సందర్శన ఉంటుంది. అదే రోజు రాత్రి 10.10 గంటలకు బ్యాంకాక్‌లో బయల్దేరితే అర్ధరాత్రి 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలివే....
సింగిల్ షేరింగ్‌కు రూ.55,640, డబుల్ షేరింగ్‌కు రూ.48,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.48,820 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
NOTE
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.