Prabhas Injury: షూటింగ్‌లో ప్రభాస్‌కి గాయం.. అభిమానులకి క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో-actor prabhas injured during movie shooting cancels kalki 2898 ad japan event visit ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Injury: షూటింగ్‌లో ప్రభాస్‌కి గాయం.. అభిమానులకి క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో

Prabhas Injury: షూటింగ్‌లో ప్రభాస్‌కి గాయం.. అభిమానులకి క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో

Galeti Rajendra HT Telugu
Dec 16, 2024 03:54 PM IST

Prabhas Injury: ప్రభాస్ కల్కి మూవీ తర్వాత జోరు పెంచాడు. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్.. మరో మూడు సినిమాల్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.

ప్రభాస్‌కి గాయం
ప్రభాస్‌కి గాయం

హీరో ప్రభాస్‌కి షూటింగ్‌లో గాయమైంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. దాంతో ఆ మూవీ షూటింగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. అయితే.. షూటింగ్‌లో ప్రభాస్ కాలికి గాయమైంది. దాంతో వైద్యుల సూచన మేరకు ప్రభాస్ ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు.

జపాన్ ట్రిప్ క్యాన్సిల్

వాస్తవానికి ప్రభాస్ ఈ నెలలో జపాన్ వెళ్లాల్సి ఉంది. అక్కడ జనవరి 3న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. దాంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌ను వెళ్లాలని ప్రభాస్ తొలుత భావించారు. కానీ.. గాయం కారణంగా ఇప్పుడు జపాన్‌కి వెళ్లే ఆలోచనని ప్రభాస్ విరమించుకున్నారు.

‘‘జపాన్‌లోని అభిమానుల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ.. అభిమానులు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్‌లో నా కాలికి గాయం అవ్వడంతో.. జపాన్‌కి రాలేకపోతున్నాను. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి ధన్యావాదాలు’’ అని ప్రభాస్ పోస్ట్ చేశారు.

వరుస సినిమాలో ప్రభాస్ బిజీ

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ మూవీకి సీక్వెల్‌ కూడా తెరకెక్కనుంది.

సందీప్ వంగాతో స్పిరిట్ మూవీని కూడా పట్టాలెక్కించే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నీ ముగిసేలోపు కల్కి సీక్వెల్‌‌ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయాలని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్‌కి ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది.

Whats_app_banner