OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Action Thriller: ఓటీటీలోకి గత నెలలో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది.
OTT Action Thriller: మలయాళం సినిమాకు ఈ ఏడాది ఓ గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. 2024లో ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. అలా నవంబర్ 8న రిలీజైన మరో మూవీ ముర (Mura). ఐఎండీబీలో 8.5 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
ముర ఓటీటీ రిలీజ్ డేట్
ముహమ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేసిన మలయాళం మూవీ ముర. గత నెలలో రిలీజైన ఈ సినిమా డిసెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతిలాంటి వాళ్లు నటించిన ఈ మూవీ నవంబర్ 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది.
ఇప్పుడు సుమారు ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ వస్తోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ముర మూవీ స్టోరీ ఏంటంటే?
ముర మూవీ థియేటర్లలో ఈ మధ్యే 50 రోజులు పూర్తి చేసుకుంది. పలువురు కొత్త నటీనటులు ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన స్టోరీగా ముర తెరకెక్కింది. నలుగురు ఉద్యోగాలు లేని యువత చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఓ దోపిడీ కోసం ప్రయత్నించిన తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నది ఈ మూవీలో చూడొచ్చు.
ఈ సినిమాను ముహ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేశాడు. గతంలో కప్పెల మూవీతో పాపులర్ అయిన డైరెక్టర్ అతడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ ముర బాగా నచ్చుతుంది. తెలుగులోనూ ఓటీటీలోకి అడుగుపెడుతుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ముర ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.