Ghee and Dal: పప్పులో ఒక స్పూను నెయ్యిని కలుపుకుని తినడం మీరు ఊహించని ప్రయోజనాలు-adding a spoonful of ghee to dal has benefits you might not expect ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee And Dal: పప్పులో ఒక స్పూను నెయ్యిని కలుపుకుని తినడం మీరు ఊహించని ప్రయోజనాలు

Ghee and Dal: పప్పులో ఒక స్పూను నెయ్యిని కలుపుకుని తినడం మీరు ఊహించని ప్రయోజనాలు

Haritha Chappa HT Telugu
Dec 16, 2024 04:30 PM IST

Ghee and Dal: పప్పు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. మీరు తినే పప్పులో కచ్చితంగా ఒక చెంచా దేశీ నెయ్యి కలిపి తినేందుకు ప్రయత్నించండి. ఇది రెట్టింపు రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఎన్నో అందిస్తుంది.

పప్పు నెయ్యి కలిపి తినడం వల్ల లాభాలు
పప్పు నెయ్యి కలిపి తినడం వల్ల లాభాలు (Shutterstock)

దేశీ నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. నెయ్యి, పప్పు… ఈ రెండూ మన భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగమే. మధ్యాహ్న భోజనం నుండి రాత్రి భోజనం వరకు పప్పును, నెయ్యిని ఏదో ఒక పూట తినే వారు ఎంతో ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకు పప్పన్నంలో నెయ్యి కలిపి తినిపిస్తూ ఉంటారు.   ఈ రెండూ అనేక రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.  ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయి. 

yearly horoscope entry point

పప్పు నెయ్యి కలిపి తింటే

గ్యాస్ సమస్యలు, ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.  ఇలాంటి వారు పప్పులో ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటే అన్నివిధాలా మంచిది. కొంతమందిలో పప్పు తిన్నాక గ్యాస్ సమస్య ఎక్కువ ప్రారంభమవుతుంది. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే పప్పులో నెయ్యి కలుపుకునే తినాలి.  నిజానికి నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ పేగు గోడలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.

మీ రోజువారీ ఆహారంలో నెయ్యి పప్పును తీసుకుంటే, ఇది మీ ఎముకలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, నెయ్యిలో కాల్షియం,  విటమిన్ కె2 పుష్కలంగా ఉన్నాయి.  ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. దీనితో పాటు, కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

శరీరంలో రోగనిరోధక శక్తి సక్రమంగా ఉంటే సీజనల్ వ్యాధులు, మరెన్నో వ్యాధులను ఎదుర్కోవడం సులువవుతుంది. ఈ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీరు ప్రతిరోజూ పప్పులో నెయ్యి కలుపుకుని తినవచ్చు. నెయ్యిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు వైరల్ వ్యాధులతో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. అలా కాకుండా శరీరంలో తరచూ నీరసం, అలసట ఉంటే పప్పులతో కలిపిన నెయ్యి తినాలి. దీంతో శరీరానికి తక్షణ శక్తితో పాటు అవసరమైన పోషకాలన్నీ అందుతాయి.

పప్పులతో కలిపిన నెయ్యి తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వాస్తవానికి నెయ్యి, పప్పు కలిపి తినడం వల్ల మెదడుకు విశ్రాంతిని, అవసరమైన కొవ్వును కూడా అందిస్తుంది.  ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే కొవ్వు న్యూరోట్రాన్స్మిటర్లను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక ప్రశాంతత, స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది కాకుండా, నెయ్యిలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner