IRCTC Tour Packages : షిరిడీ వెళ్లాలనుకుంటున్నారా? మీకోసమే ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్
IRCTC Shirdi Tour Package : మీకు షిరిడీ వెళ్లాలని ఉందా? అయితే ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి షిరిడీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. తాజాగా షిరిడీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నుంచి వెళ్లి రావొచ్చు. సాయి సన్నిధి పేరుతో ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ కు సంబంధించిన వివరాలివే..
ఐఆర్‌సీటీసీ సాయి సన్నిధి పేరిట టూర్ ప్యాకేజీ అందిస్తోంది. షిరిడీ వెళ్లాలనుకునేవారు.. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. రైలు మార్గంలో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనం ఉంటుంది. అంతేకాదు.. శనిశిగ్నాపూర్ కూడా వెళ్లి రావొచ్చు. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ ప్లాన్ చేసింది.
ఐఆర్‌సీటీసీ టూరిజం షిరిడీ టూర్ ప్యాకేజీ మొదటి రోజు విజయవాడలో ప్రారంభమవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. నైట్ అంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ వెళ్తుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వా.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం తిరగొచ్చు. రాత్రికి షిరిడీలోనే బస ఉంటుంది.
మూడో రోజు.. ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శనకు వెళ్లాలి. అనంతరం షిరిడీకి రావాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కాలి. మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 విజయవాడకు వస్తారు. దీంతో టూర్ కంప్లీట్ అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్‌కి స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ క్లాస్‌కి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉంటాయి.
ఇక టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4850 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,280, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,930, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5420గా ధర నిర్ణయించారు.
కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,080, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7310 చెల్లించాలి. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.14,740గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9,380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7880గా నిర్ణయించారు.