తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tourism: హైదరాబాద్ టు వయనాడ్ … టూర్ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tourism: హైదరాబాద్ టు వయనాడ్ … టూర్ ప్యాకేజీ వివరాలివే

26 August 2022, 13:00 IST

    • hyderabad - wayanad tour package:హైదరాబాద్ నుంచి వయనాడ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ వయనాడ్ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ వయనాడ్ టూర్ ప్యాకేజీ (irctc tourism)

హైదరాబాద్ వయనాడ్ టూర్ ప్యాకేజీ

irctc tourism hyderabad - wayanad tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని వయనాడ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'WONDERS OF WAYANAD' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. కన్నూరు, వయనాడ్ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

hyderabad - wayanad tour: ఈ నెల ఆగస్టు 30న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Tuesday: ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్(Kacheguda - Mangalore Central Express) నుంచి బయల్దేరుతారు.

Day 02 Wednesday: ఉదయం 06.17 నిమిషాలకు కన్నూరుకు చేరుకుంటారు. ఫ్రెష్ అప్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అంజిలో ఫోర్టును, అరక్కల్ మ్యూజియంను సందర్శిస్తారు. ఇక్కడ్నుంచి వయనాడు ప్రయాణం ఉంటుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. రాత్రి కాల్ పెట్టలో బస చేస్తారు.

Day 03 Thursday: హోటల్ బ్రేక్ ఫాస్ట్ తర్వాత కుర్వాదీప్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. తురునేల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్ ను సందర్శిస్తారు. రాత్రికి కూడా కాల్ పెట్టలోనే బస చేస్తారు.

Day 04 Friday: బ్రేక్ ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును సందర్శిస్తారు. రాత్రి కాల్ పెట్టలోనే ఉంటారు.

Day 05 Saturday: బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఇక్కడ్నుంచి కొజికోడ్ కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్ తర్వాత సాయంత్రం ఎస్ఎం స్ట్రీట్ లో షాపింగ్ చేయవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వే స్టేషన్ వెళ్తారు. ఇక్కడ రాత్రి 11.35కి తిరిగి ప్రయాణం అవుతారు.

Day 06 Sunday: రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ముగుస్తుంది.

ధరలివే....

hyd wayanad tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 35,130 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 20,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,590 గా ఉంది. 3 Tier AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

టాపిక్