తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

05 May 2024, 12:44 IST

    • Telangana Tourism Mysore Ooty Tour 2024 : మైసూర్, ఊటీ చూసేందుకు తెలంగాణ టూరిజం(Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి సోమవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
హైదరాబాద్ - మైసూర్ - ఊటీ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - మైసూర్ - ఊటీ టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ - మైసూర్ - ఊటీ టూర్ ప్యాకేజీ

Mysore Ooty Tour Package 2024 : ఈ సమ్మర్ లో ఏదైనా మంచి టూరిస్ట్ ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? మీ కోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. బెంగళూరు, మైసూరుతో పాటు ఊటీని చూసేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

ఈ ప్యాకేజీ ప్రతి సోమవారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుంచి జర్నీ ఉంటుంది. రోడ్జు మార్గం(బస్సు) ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఆరు రోజులపాటు సాగే ఈ టూర్ లో ఎన్నో టూరిస్ట్ ప్లేసులను చూడొచ్చు.

హైదరాబాద్ - ఊటీ - మైసూర్ టూర్ షెడ్యూల్ :

  • ఊటీ - మైసూర్ - బెంగళూరు చూసేందుకు తెలంగాణ టూరిజం(Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
  • ‘BENGALURU-OOTY-MYSORE TOUR’ పేరుతో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
  • ప్రతి సోమవారం తేదీల్లో జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • ఫస్ట్ డే మధ్యాహ్నం 03.30 గంటలకు హైదరాబాద్ లోని యాత్రినివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. బషీర్ బాగ్ కు 4:00 PMకు చేరుకుంటుంది. నైట్ బెంగళూరుకు వెళ్తారు.
  • సెకండ్ డే ఉదయం 6 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. టిఫిన్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. Bull Temple,లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, తిపస్ ప్యాలెస్ చూస్తారు. సాయంత్రం తిరిగి హోటల్ కు చేరుకుంటారు.
  • మూడో రోజు బెంగళూరు నుంచి ఉదయం 4 గంటలకే ఊటీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఊటీకి చేరుకుంటారు. దొడబెట్టలోని పలు ప్రాంతాలు చూస్తారు. బోటానికల్ గార్డెన్ సందర్శనతో పాటు పాటు బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు హోటల్ కు చేరుకుంటారు.
  • ఇక నాల్గో రోజు మైసూరుకు(Mysore) వెళ్తారు.సాయంత్రం Brindaavan Gardenను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్ కు చేరుకుంటారు.
  • ఐదో రోజు మైసూరుకు చేరుకుంటారు. Chamundeswari ఆలయ దర్శనంతో పాటు మైసర్ మహారాజ్ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ ను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.
  • ఆరో రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 11,999గా ఉంది. పిల్లలకు రూ. 9,599గా నిర్ణయించారు. వోల్వో కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

హైదరాబాద్ టూ గోవా 

Telangana Tourism Goa Tour Package: హైదరాబాద్ నుంచి గోవా(Goa Tour Packag) టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది తెలంగాణ టూరిజం. GOA PACKAGE TOUR – ITINERARY పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. https://tourism.telangana.gov.in/p  వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. బస్సులో రోడ్డు మార్గానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి సోమవారం తేదీల్లో ఈ టూర్ జర్నీ ఉంటుంది.

తదుపరి వ్యాసం