Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!
Papikondalu Tour Package : తూర్పు కనుమల్లోని పాపికొండల్లో టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా? ఏపీ టూరిజం 1 డే టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది. రాజమండ్రి నుంచి పాపికొండల వరకు నదిలో క్రూయిజ్ లను ఏర్పాటుచేసింది.
Papikondalu Tour Package : సమ్మర్ ఉక్కపోతతో విసుగెత్తిపోయారా? అలా గోదావరిలో.. పాపి కొండల (Papikondalu Tour)మధ్య విహరించాలని అనుకుంటున్నారా? అయితే ఏపీ టూరిజం రాజమండ్రి నుంచి పాపికొండల్లో(Rajahmundry to Papikondalu) విహారానికి 1 డే టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రాజమండ్రి నుంచి దాదాపు 100 కి.మీ దూరంలో గోదావరి నది మధ్యలో గోడలాగా పాపికొండలు మూడు ఉన్నాయి. లగ్జరీ క్రూయిజ్ బోట్(LuxuryCruise Boat) లలో పాపికొండల సుందరమైన అందాలను ఆస్వాదించవచ్చు.
పాపి కొండలు తూర్పు కనుమల(Eastern Ghats)లో ఉన్న ఒక సుందరమైన కొండల ప్రదేశం. పాపికొండ కొండలు మార్ష్ మొసలి, వలస వచ్చే అరుదైన పక్షులతో సహా అనేక రకాల వృక్షాలు, జంతువులకు నిలయం. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే ఈ కొండలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్వరలో కనుమరుగవుతున్న ఈ కొండలకు చూసేందుకు ఏపీ టూరిజం(APTDC) రివర్ క్రూయిజ్‌లను ఏర్పాటు చేసింది.
పాపికొండలు టూర్ లో చూసే ప్రదేశాలు
పాపికొండలు టూర్ ప్యాకేజీ(Papikondalu Tour Package)లో గండిపోచమ్మ దేవాలయం, పాపికొండలు, పేరంటపల్లి ఆశ్రమం, దేవాలయం కవర్ చేస్తారు. బోటు ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ ఏరియా, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో ఉదదయం బ్రేక్ ఫాస్ట్, మినరల్ వాటర్, శాఖాహార భోజనం అందిస్తారు.
టూర్ షెడ్యూల్ ఇలా ?(Papikondalu Tour Schedule)
ఉదయం 7:30 గంటలకు రోడ్డు మార్గంలో పట్టిసీమ(Pattiseema) రేవు, పోలవరం(Polavaram) రేవు, పురుషోత్తపట్నం(Purushothapatnam) రేవులోని బోట్ల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తారు. ఉదయం 9.00 గంటలకు బోట్(Boat)లో అల్పాహారం, ఆపై గోదావరి నదిలో ప్రయాణం మొదలవుతుంది. 10.30 గంటలకు గండిపోచమ్మ ఆలయానికి(Gandipochamma Temple) చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రయాణ మార్గంలో మధ్యాహ్నం 1.00 గంటకు పడవలో శాఖాహార భోజనం అందిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటలకు పాపికొండల వద్దకు(Papikondalu Boat Tour) బోటులో చేరుకుంటారు. పాపి కొండల మధ్య ప్రయాణం ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం 3.00 గంటలకు ఖమ్మం జిల్లా పేరంటపల్లి గ్రామానికి బోటు చేరుకుంటుంది. అక్కడ రామకృష్ణ ముని ఆశ్రమం, వీరేశ్వర స్వామి దేవాలయం, శివుడ్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవుకు పడవలో తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 7.30 గంటలకు రోడ్డు మార్గంలో రాజమండ్రికి తీసుకొస్తారు. రాత్రి 8.30 గంటలకు పర్యాటకులు రాజమండ్రి చేరుకుంటారు. ఏపీ టూరిజం బోట్లలో టూర్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8.00 వరకు ఉంటుంది.
పర్యాటకులు https://tourism.ap.gov.in/tours , www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో పాపికొండలు టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోచ్చు. ఈ వెబ్ సైట్ లో రాజమండ్రిలోని బడ్జెట్ హోటళ్లను బుక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం