Telangana Tourism Goa Tour Package 2024: ఈ హాట్ సమ్మర్ లో హాయిగా గోవాలో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా..? తక్కువ ఖర్చులోనే వెళ్లి రావాలని చూస్తున్నారా..? మీలాంటి వారికి తెలంగాణ టూరిజం (Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.
హైదరాబాద్ నుంచి గోవా(Goa Tour Packag) టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. GOA PACKAGE TOUR – ITINERARY పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. బస్సులో రోడ్డు మార్గానే వెళ్లాల్సి ఉంటుంది.
ఇక ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలాని(Arunachalam)కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అయితే భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని… తెలంగాణ టూరిజం(Telangana Tourism) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism’ పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలానికి తీసుకెళ్తుంది. 4 రోజుల ప్యాకేజీ ఇది. పెద్దలకు రూ. 7500గా టికెట్ ధరను నిర్ణయించారు. చిన్న పిల్లలకు రూ. 6000గా ఉంది. ప్రస్తుతం మే 20వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
ఈ నెలకు సంబంధించిన టూర్ ప్యాకేజీ బుకింగ్ చేసుకోలేకపోతే… వచ్చే నెలలో మళ్లీ ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ నెలలో అయితే 19వ తేదీన అందుబాటులో ఉంది. జూన్ నెల ప్యాకేజీ పూర్తి అయిన తర్వాత… మిగతా నెలల తేదీలను ప్రకటిస్తుంది తెలంగాణ టూరిజం.
సంబంధిత కథనం